సంవత్సరానికో నందమూరి వారి సినిమా..
Send us your feedback to audioarticles@vaarta.com
సరిగ్గా పదేళ్ల క్రితం ఒకే సంవత్సరంలో ఇద్దరు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలతో సందడి చేశాడు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. 2007లో వచ్చిన ఆ చిత్రాలే అల్లు అర్జున్ నటించిన దేశముదురు. రామ్ చరణ్ నటించిన తొలి చిత్రం చిరుత. ఆ రెండు సినిమాలు కూడా పూరీ నుంచి వచ్చిన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలే కావడం విశేషం. మళ్లీ పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామేన్ గంగతో రాంబాబు, బన్నీ హీరోగా వచ్చిన ఇద్దరమ్మాయిలతో చిత్రాలు కూడా పూరీ వరుస చిత్రాలే.
కట్ చేస్తే.. ఇప్పుడు ఇదే శైలిని నందమూరి హీరోలతో వేరే కోణంలో కొనసాగిస్తున్నాడు పూరీ. 2015లో ఎన్టీఆర్‌తో టెంపర్ చిత్రాన్ని తెరకెక్కించిన పూరీ.. 2016లో కళ్యాణ్ రామ్ ఇజం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక 2017లో ఏమో నందమూరి బాలకృష్ణతో పైసా వసూల్ అంటూ సందడి చేయనున్నాడు. అంటే పూరీ డైరెక్షన్‌లో సంవత్సరానికో నందమూరి వారి సినిమా అన్నట్లుగా మూడేళ్ల పాటు కంటిన్యూ అయిందన్నమాట. పైసా వసూల్ ఈ సెప్టెంబర్ 21న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com