వ‌రుణ్‌తేజ్‌ను క‌లిసేందుకు 200 కిమీ న‌డిచిన అభిమాని

  • IndiaGlitz, [Monday,February 01 2021]

మెగాప్రిన్స్‌ను క‌ల‌వ‌డానికి తెలంగాణకు చెందిన ఓ అభిమాని 200 కి.మీ దూరం న‌డుచుకుంటూ వ‌చ్చాడు. వివ‌రాల్లోకి వెళితే, తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి బిక్క‌నూరుకి చెందిన బాలు అనే వ్య‌క్తికి మెగా కుటుంబం అంటే అభిమానం. ముఖ్యంగా వ‌రుణ్ తేజ్ అంటే చాలా ఇష్టం. గ‌త మూడేళ్ల నుంచి బాలు వ‌రుణ్‌తేజ్‌ను క‌ల‌వ‌డానికి ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈసారి ఎలాగైనా వ‌రుణ్‌తేజ్‌ను క‌ల‌వాల‌ని రెండు వంద‌ల కిలోమీట‌ర్లు న‌డుచుకుంటూ హైద‌రాబాద్ చేరుకున్నాడు. విష‌యం తెలుసుకున్న హీరో వ‌రుణ్‌తేజ్ బాలుని త‌న కార్యాల‌యానికి పిలిపించుకుని మాట్లాడాడు. అభిమాని వివ‌రాల‌ను తెలుసుకున్నాడు. త‌న‌ను క‌లిసేందుకు కాలిన‌డ‌క‌న వ‌చ్చిన అభిమానికి వ‌రుణ్‌తేజ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఇక వ‌రుణ్‌తేజ్ సినిమాల విష‌యానికి వ‌స్తే, వ‌రుణ్‌తేజ్ రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అందులో ఒక‌టి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేశ్‌తో క‌లిసి న‌టిస్తోన్న ఎఫ్ 3 చిత్రం. ఈ ఫ‌న్ రైట‌ర్ ఆగ‌స్ట్ 27న విడుద‌ల‌వుతుంది. అయితే అంత కంటే ముందే వ‌రుణ్‌తేజ్ బాక్స‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్న గ‌ని చిత్రం జూలై 30న విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రానికి కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.