Ravanasura:రావణసుర మూవీ సీన్ లీక్ .. ఆడవాళ్లనుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు, రవితేజ నోటి వెంట ఆ మాటలా ..?
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో రవితేజ కానీ, ఆయన సినిమాలు కానీ వివాదాలకు దూరంగా వుంటాయి. కుటుంబం మొత్తం కలిసి చూసేలా వినోదం అందించేలాగా ఆయన సినిమాలు చేస్తారు. మాస్ మహారాజా సినిమా వస్తుంటే ఫుల్ మీల్స్ పక్కా అని చిత్ర పరిశ్రమతో పాటు ఆడియన్స్ అనుకుంటూ వుంటారు. అయితే రేపు విడుదల కానున్న రవితేజ్ లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’కు సంబంధించి ఓ డైలాగ్ వివాదాస్పదమవుతోంది. ‘‘ కంచం ముందుకి... మంచం మీదకి ఆడపిల్లలన్నీ పిలవగానే రావాలి... లేకపోతే నాకు మండుద్ది... దా’’ అంటూ రవితేజ్ చెబుతున్న డైలాగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో ఓ ఆడపిల్లతో రవితేజ డైలాగ్ చెబుతున్నట్లుగా వుంది. ఈ వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంటోంది. తక్షణం చిత్ర యూనిట్ తమకు క్షమాపణలు చెప్పాలని, రావణాసుర చిత్రం నుంచి ఈ డైలాగ్ తొలగించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
డైలాగ్ లీక్ ఎవరి పని :
అయితే రావణాసుర రేపు విడుదల కానుంది. ఇంకా థియేటర్లలోకి రాకుండానే ఈ సినిమా నుంచి డైలాగ్ లీక్ కావడం కలకలం రేపుతోంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినదా లేదంటే చిత్ర యూనిట్‌లోని ఎవరైనా లీక్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ డైలాగ్ మాత్రం రవితేజ నోటి వెంట రావడాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రావణాసుర:
అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గతంలో ధమాకాకు పనిచేసిన భీమ్స్ సిసిరోలియో , హర్షవర్ధన్ రామేశ్వర్లు స్వరాలు సమకూరుస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7న రావణాసుర ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మాస్ మహారాజా నట విశ్వరూపాన్ని వెండితెరపై వీక్షించేందుకు రెడీగా వుండండి. జయరామ్, రావు రమేశ్, హీరో సుశాంత్‌లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments