Chandrababu: అలవికాని హామీలు ఎందుకు.. మాటిస్తే ఎన్టీఆర్‌లా నిలబడాలి.. చంద్రబాబుకు ప్రశ్నల వర్షం..

  • IndiaGlitz, [Thursday,February 22 2024]

ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. మరో 50 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలు దూకుడు పెంచాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు హామీలు ఇస్తూ వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 'బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారంటీ' పేరుతో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ఈ పథకాలను అమలు చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ హామీలు అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదని.. అలాంటప్పుడు ఎలా అమలు చేస్తారని ప్రతిపక్షాలతో పాటు మేధావులు ప్రశ్నిస్తున్నారు.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ సామాన్యుడు సోషల్ మీడియా వేదిక మీద పోస్ట్ చేశాడు. ఇప్పుడే హైదరాబాద్ టీడీపీ ఆఫీస్ మీదనుంచి వెళ్తుంటే ఆఫీస్ ఎదురుగా ఈ ఫ్లెక్సీ కనిపించింది.. 'బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ' అంటూ ఈ 'super six' ని ఫ్లెక్సీగా వేసి ఆఫీస్ ముందు పెట్టారు. మళ్ళీ పక్కనే రామారావుగారి బొమ్మ.. ఎందుకో ఆ హామీలకీ.. అన్నగారికీ అస్సలు సింక్ అయ్యినట్టు అనిపించలేదు. ఎందుకంటే.. 'నేను చూస్తుండగా'.. ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చిన ఏకైక రాజకీయ నాయకుడు ఎన్టీఆర్.

తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ రెండు రూపాయలకు కిలో బియ్యం..పేదలకు జనతా వస్త్రాలు..50రూపాయలకే కరెంట్..పేదలకు పక్కా గృహాలు (సాధ్యమైనన్ని కట్టాడు) పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం..దేవాలయాల్లో అన్నప్రసాదాలు.. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు..పాలనాసౌలభ్యం కోసం మండలి వ్యవస్థ ప్రవేశపెట్టడం.. స్త్రీలకు ఆస్థిలో సమాన హక్కు.. చివరకు 'మద్యపాన నిషేధం' కూడా చెప్పాడు.. చేశాడు..ఇవన్నీ ఆరేడేళ్ళలో చేసిన సంస్కరణలు.. అందుకే ఎన్టీఆర్ అంటే విశ్వసనీయతకు మారుపేరు..(ఇంకెవరూ కాదు ..)ఈరోజున మనం బతుకుతున్న సొసైటీని నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్.. చేయాలన్న సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి ఎన్టీఆర్ ఒక నిలువెత్తు సాక్ష్యం. అని పేర్కొన్నాడు.

అలాంటి మహానుభావుడి ఫోటో పెట్టి.. సాధ్యం కాని హామీలతో జనాన్ని మోసం చేయడం సబబేనా బాబుగారు? అంటూ ప్రశ్నించాడు. రూ.3000 నిరుద్యోగ భృతి ఓకే.. మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం ఓకే..మరి స్కూలుకెళ్లే ప్రతి విద్యార్ధికీ ఏడాదికి 15000 రూపాయలు ఎలా.. ఏ విద్యార్థికి? విద్యార్థులందరికీ ఇస్తారా? తెల్ల కార్డులున్న పేద, దిగువ మధ్యతరగతి పిల్లలకు మాత్రమే ఇస్తారా? అని అడిగాడు. అలాగే ప్రతి రైతుకీ ఏటా 20000 ఆర్థిక సాయం..? అన్నారు.. ఏ రైతులకీ? కౌలు రైతులకా? లేక పొలం గల రైతులకా? లేక ఇద్దరికీ ఇస్తారా? అని ప్రశ్నించాడు. ఇక ప్రతి ఇంటికీ ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలండర్లు..? ప్రతి ఇంటికీ ఇస్తారా? లేక తెల్ల కార్డులున్న పేద, దిగువ మధ్యతరగతి వారికి మాత్రమే ఇస్తారా?.. ప్రతి స్త్రీకి నెలకు 1500 రూపాయలు..?రాష్ట్రంలో చిన్న, పెద్ద, ముసలి ముతకా, పేద, ధనిక.. ఇలా స్త్రీలందరికీ ఇస్తారా? లేక తెల్ల కార్డులున్న పేద, దిగువ మధ్యతరగతి మహిళలకు మాత్రమే ఇస్తారా? అని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేశాడు.

హామీల్లో క్లారిటీ ఉండాలి.. అమలులో నిజాయితీ ఉండాలి..రాజకీయాలు విపక్షాలపై చేయాలి.. జనం మీద కాదు.. అంటూ చురకలు అంటించాడు. గెలుపే లక్ష్యంగా పెట్టుకోవడం తప్పు కాదు.. దానికోసం జనాన్ని మోసం చేయకూడదు అన్నాడు. ఇప్పటికే తడుముకోకుండా అబద్దాలాడి ఒకడు ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు.. సాధ్యం కాని హామీలతో రాష్ట్రాన్ని సర్వ భ్రష్టుత్వం పట్టించాడు.. అభివృద్ధిని గాలికొదిలి.. జనానికి ఫ్రీగా డబ్బులు పంచి.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు.. అని మండిపడ్డాడు.

ఇప్పుడు మీరు కూడా.. ఇంత అనుభవం ఉండి.. ఇలా జనాన్ని మోసం చేస్తే.. ఇక భావితరాలకు న్యాయం జరిగేదెప్పుడు? ఇవన్నీ ఇచ్చి రాజధాని ఎప్పుడు కడతారు? పోలవరం ఎప్పుడు నిర్మిస్తారు..?అని ప్రశ్నించాడు. జరిగిన తప్పుల్ని దిద్దండి చాలు..ఆగిన అభివృద్ధి రైలుని పట్టాలెక్కించండి చాలు.. ఈ అలవికాని తాయిలాలు ఎందుకు చెప్పండి? మాటిస్తే రామారావు గారిలా నిలబడాలి అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పోస్ట్ చేసిన వ్యక్తి అభిప్రాయాలను చూస్తే అతను తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు లాగా ఉన్నాడు. అయినా కానీ ఉచిత పథకాలను వ్యతిరేకిస్తున్నాడు. అతడే కాదు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రతి ఒక్కరూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే వాటికే రాష్ట్ర బడ్జెట్ సరిపోదని.. ఇక అభివృద్ధి ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టి చూస్తుంటే నూటికి 80శాతం మంది రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని అర్థమవుతోంది. అందుకే నాయకులు మీ గెలుపు కోసం అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అభివృద్ధిని విస్మరించవొద్దని రాజకీయ విశ్లేషకులు, మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు.

More News

Pawan Kalyan:పవన్ కల్యాణ్‌ చేతికి రెండు ఉంగరాలు.. ఎందుకో తెలుసా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తూ నియోజకవర్గాల

Shanmukh Jaswanth: అరే ఏంట్రా ఇది.. గంజాయి సేవిస్తూ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ అరెస్ట్..

వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా.. ఒకే దెబ్బకి రెండు పిట్టలా.. పోలీసులకు ఇద్దరు అన్నదమ్ములు భలే దొరికారు. ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ మరోసారి వార్తల్లో నిలిచాడు.

Tirumala:తిరుమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. రమణదీక్షితులు సంచలన ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసే వీడియో తెగ వైరల్ అవుతోంది.

టీవీ5 సాంబశివరావుపై భూకబ్జా ఆరోపణలు.. నెటిజన్లు తీవ్ర విమర్శలు..

టీవీ5 న్యూస్ యాంకర్ సాంబశివరావుకు సంబంధించిన ఓ వ్యవహారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆయన కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న

Nikhil: తండ్రి అయిన హీరో నిఖిల్.. నెటిజన్లు శుభాకాంక్షలు..

టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ తండ్రయ్యారు. ఆయన భార్య డాక్టర్‌ పల్లవి వర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తన కుమారుడిని ముద్దాడుతున్న ఫొటోను