BiggBoss: శ్రీసత్య, రోహిత్‌లకు ఓట్లు అడిగే ఛాన్స్.. ఒంటరైన రేవంత్, మిడ్‌వీక్ ఎలిమినేషన్ ఎవరో..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 (Bigg Boss 6)తెలుగు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం ఇంటిలో ఆరుగురు కంటెస్టెంట్స్ వుండగా.. వీరిలో ఒకరిని మిడ్ వీక్‌లో ఎలిమినేట్ చేస్తామని హోస్ట్ నాగార్జున ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా... ఈరోజు కంటెస్టెంట్స్ తెలివిని, సమయస్పూర్తిని రాబట్టేలా టాస్క్‌లు ఇచ్చాడు బిగ్‌బాస్. ఓట్ కోసం ప్రేక్షకులను అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తూనే ఛాలెంజ్‌లు విసిరాడు. ముందుగా మీకు వినిపిస్తుందా అన్న టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్.. ఇంటిలో ప్లే చేసే కొన్ని శబ్ధాలను గుర్తించి వాటిని సరైన క్రమపద్ధతిలో రాయాలి. ఈ టాస్క్‌లో రోహిత్, ఆదిరెడ్డి విజయం సాధించగా రేవంత్, కీర్తి, రేవంత్, శ్రీహాన్‌లు, శ్రీసత్యలు ఓడిపోయారు. అయితే శ్రీసత్య కారణంగానే తాను ఓడిపోయానంటూ శ్రీహాన్ గొడవకు దిగాడు. నీవల్లే టాస్క్ ఓడిపోయానని శ్రీసత్యపై మండిపడ్డాడు. నా వల్ల కేవలం రెండు పాయింట్స్ మాత్రమే పోయాయని, నీ తప్పు కూడా వుండబట్టే ఓడిపోయావని.. అనవసరంగా నన్ను బ్లెయిమ్ చేయొద్దని శ్రీసత్య ధీటుగా బదులిచ్చింది. తర్వాత శ్రీహాస్ క్షమాపణలు చెప్పడంత వివాదం సద్దుమణిగింది.
ఇక టాస్క్‌లో గెలిచిన ఆదిరెడ్డి, రోహిత్ (Adireddy Rohith)లలో ఒకరిని మాత్రమే ఏకాభిప్రాయంతో ఓట్ల కోసం అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలని ఇంటి సభ్యులకు చెప్పారు బిగ్‌బాస్. శ్రీహాన్, శ్రీసత్య, కీర్తిలు రోహిత్‌కే ఓటు వేయడంతో అతనికి ఓట్లు అడిగే అవకాశం దక్కింది. అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. తన ఆటతీరు, మాటతీరు, ఆలోచనా విధానం అన్ని తొలి నుంచి మీరు చూస్తూనే వున్నారు. తనకు అదృష్టం కలిసిరావట్లేదని, బిగ్‌బాస్ టైటిల్ గెలవాలన్నదే తన కల అన్న రోహిత్.. అందుకు మీ అందరి సహకారం కావాలని ప్రేక్షకులను కోరాడు.
తర్వాత ఎగ్స్ షాట్ అనే ఛాలెంజ్ విసిరాడు బిగ్‌బాస్. ఇందులో ఆదిరెడ్డి, రోహిత్ తప్పించి మిగిలిన నలుగురు పార్టిసిపేట్ చేయగా.. శ్రీసత్య ,రేవంత్ గెలిచారు. ఎప్పటిలాగే ఏకాభిప్రాయంతో ఒకరిని సెలెక్ట్ చేయమని బిగ్‌బాస్ చెప్పగా... శ్రీహాన్, కీర్తి, రోహిత్‌లు కీర్తికి ఓటేయడంతో ఆమెకు అదృష్టం దక్కింది. అయితే దీనిని ఆదిరెడ్డి (Adireddy)తప్పుబట్టాడు. గెలిచేవాడికి ఛాన్స్ ఇవ్వాలని, శ్రీసత్యకు ఇస్తే ఏం ఉపయోగం వుంటుందని చెబుతూ పరోక్షంగా రేవంతే విన్నర్ అని సంకేతాలిచ్చాడు ఆదిరెడ్డి. దీనికి శ్రీసత్య కూడా గట్టిగా బదులిచ్చింది. గెలుస్తాడని అంత ఖచ్చితంగా తెలుస్తున్నప్పుడు.. ఆయన ప్రత్యేకంగా ఓట్లు అడిగే అవసరం లేదని చెప్పింది.
అనంతరం శ్రీసత్య (Sri Satya)ప్రేక్షకులతో మాట్లాడుతూ.. సీజన్ తొలి రోజుల్లో దెబ్బలు తగులుతాయనే భయంతో ఓ మూల కూర్చొనేదాన్నని చెప్పింది. కానీ మూడో వారం నుంచి నూటికి నూరు శాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడానని....విజయం మీ చేతుల్లోనే వుందని, తానేమైనా తప్పు చేసుంటే క్షమించాలని శ్రీసత్య ఆడియన్స్‌ని కోరింది. అయితే బిగ్‌బాస్ తుది విజేత ఎవరో తేల్చే చివరివారం ఓటింగ్స్‌కు లైన్స్ ఓపెన్ అయ్యాని ముందే నాగ్ తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్స్‌ను లెక్కిస్తాని చెప్పారు. కానీ బుధవారం అర్ధరాత్రి వరకు పోలైన ఓట్లను బట్టి శ్రీసత్య ఎలిమినేట్ అయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com