బాహుబలి దర్శక నిర్మాతలపై పిర్యాదు..
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు, బిగ్ బడ్జెట్ సినిమాలు విడుదలకు ముందు కథ మాదంటూ వివాదాలు క్రియేట్ అవుతాయి. విడుదల తర్వాత మమ్మల్ని అగౌరవపరిచారంటూ కేసులు నమోదు అవుతుంటాయి. ఇప్పుడు బాహుబలి-2 విషయంలో విడుదల తర్వాత బాహుబలి దర్శక నిర్మాతలు మమ్మల్ని అగౌరవ పరిచారంటూ ఆరెకటిక సమితి బంజారా హిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసింది.
వివరాల్లోకెళ్తే..కటిక చీకటి అనే పదం వాడటం తమ కులాన్ని అగౌరవ పరిచేవిధంగా ఉందని, ఆ పదాన్ని తొలగించాలని లేకుంటే రాజమౌళి ఇంటిని ముట్టడిస్తామని ఆరెకటిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్, సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్, మహేష్, సంతోష్, గురుచరణ్ హెచ్చరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయ సలహా అనంతరం కేసు నమోదు చేయాలా వద్దా అని ఆలోచిస్తామని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments