'అ..ఆ..'ఆ లిస్ట్ లో చేరుతుందట
Send us your feedback to audioarticles@vaarta.com
లేడీలక్ సమంతకి తెలుగులో సింహభాగం విజయాలున్నాయి. అయితే వాటిలో ఆమెకి నటన పరంగా పేరు తెచ్చిన చిత్రాలంటే 'ఏమాయ చేసావే', 'మనం' మాత్రమే. మిగిలిన చిత్రాలేవీ సమంతకి ఆ స్థాయి పేరుని తీసుకురాలేదు. అయితే ఆ రెండు చిత్రాల తరువాత తనకి అభినయం విషయంలో పేరు తీసుకువచ్చే మూడో చిత్రంగా 'అ..ఆ..'నిలుస్తుందని సమంత తన సన్నిహితుల వద్ద చెప్పుకొస్తోందట.
అనసూయ రామలింగం పాత్రలో ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించనంత యాక్టింగ్ స్కిల్స్ తో ఈ సినిమాలో కనిపిస్తానని సమంత ఆశాభావంతో చెప్పుకొస్తోందట. త్రివిక్రమ్ డిజైన్ చేసిన హీరోయిన్ క్యారెక్టర్స్‌లో ఇదే బెస్ట్ అని, నవరసాలున్న పాత్రలో తనని చూసి ఆడియన్స్ సర్‌ప్రైజ్‌గా ఫీలవుతారని సమంత నమ్మకంతో చెబుతోంది. చూద్దాం.. సమంత నమ్మకం ఎంతవరకు ఫలిస్తుందో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com