'అ..ఆ..'తోనైనా త్రివిక్రమ్ ట్రాక్ మారుస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
మాటలతో మాయ చేయడం ఎంతబాగా తెలుసో.. దృశ్యాలను కూడా ఆకట్టుకునేలా తీయడం రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి అంతే బాగా తెలుసు. అయితే ఓ విషయంలో మాత్రం త్రివిక్రమ్ ను విమర్శించిక తప్పదు. అదేమిటంటే.. కథానాయకుల పాత్రలను బలంగా చూపించే ఈ మాటల మాంత్రికుడు .. కథానాయికలను మాత్రం తింగరబుచ్చి పాత్రల్లోనూ లేదంటే ఏదో ఒక లోపం ఉన్న పాత్రగానో చూపించి వినోదాన్ని అందించే ప్రయత్నమే చేస్తుంటాడు కానీ వారి పాత్రలను బలంగా చూపిన వైనం మచ్చుకు ఒక్కటైనా కనిపించదు.
'నువ్వే నువ్వే, అతడు' చిత్రాల్లో శ్రియ, త్రిష పాత్రలను అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా చూపించిన త్రివిక్రమ్.. 'జల్సా'లో ఇలియానాని దృష్టిదోషం ఉన్న అమ్మాయిగా చూపించాడు. 'ఖలేజా'లో అయితే అనుష్కని నష్టజాతకురాలుగా చూపించాడు. 'జులాయి'లో ఏమో ఇలియానాని కరువు వచ్చిన కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్లా చూపించాడు. 'అత్తారింటికి దారేది'లో సమంతని తింగరబుచ్చిగానూ.. కాసేపు మతిమరుపు ఉన్న అమ్మాయిగానూ చూపాడు. అదే సమంతని 'సన్నాఫ్ సత్యమూర్తి'లో షుగర్ పేషంట్‌గా చూపాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తన కొత్త చిత్రం 'అ..ఆ'లోనైనా హీరోయిన్ని కాస్త బలమైన పాత్రలో చూపి ట్రాక్ మారుస్తాడో.. లేదంటే అలవాటైన విధానంలో వెళతాడో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout