'అ..ఆ..'తో బ్రేక్ పడుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
'ఇష్క్', 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు నితిన్. అయితే.. ఆ తరువాత నటించిన సినిమాలే నితిన్‌కి ఏ మాత్రం అచ్చి రాలేదు. ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రం 'అ..ఆ.'.పై బోలెడు ఆశలను పెట్టుకున్నాడు ఈ యువ కథానాయకుడు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్, సమంత లాంటి టాప్ హీరోయిన్‌తో కలిసి పనిచేయడం నితిన్‌కి ప్లస్ అయ్యే అంశమే.
అయితే.. ఈ ఇద్దరి పరంగా నితిన్‌కి ఓ నెగెటివ్ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. ఈ ఇద్దరూ తన అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్‌కి అచ్చొచ్చిన వారే. అయితే అలా అచ్చి రావడం మాత్రం నితిన్‌కి ఇంతకు ముందు వరకు కలిసి రాలేదు. అదెలాగంటే.. పవన్‌తో హిట్ కొట్టిన దర్శకులు కానీ, హీరోయిన్ కానీ నితిన్‌కి ఏ మాత్రం కలిసిరాలేదు.
పవన్‌కి 'బద్రి'లాంటి హిట్ ఇచ్చిన పూరీ.. నితిన్ 'హార్ట్ ఎటాక్'కి అంతగా అచ్చి రాలేదు. ఇక పవన్ కెరీర్‌ని కీలక మలుపు తిప్పిన చిత్రమైన 'తొలి ప్రేమ'కి దర్శకత్వం వహించిన కరుణాకరన్.. నితిన్‌తో 'చిన్నదానా నీకోసం' చేస్తే అది కూడా ఆశించిన విజయం సాధించలేదు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే.. 'జల్సా' రూపంలో పవన్‌కి కలిసొచ్చిన ఇలియానా.. 'రెచ్చిపో' అంటూ నితిన్‌తో సినిమా చేస్తే అది డిజాస్టర్ అయింది.
ఈ నేపథ్యంలో 'అత్తారింటికి దారేది' కోసం పవన్‌తో కలిసి పనిచేసిన దర్శకుడు త్రివిక్రమ్, హీరోయిన్ సమంతతో చేస్తున్న ప్రయత్నం నితిన్‌కి సెంటిమెంట్ పరంగా నెగెటివ్ రిజల్ట్ ఇస్తుందో.. విడివిడిగా కలిసిరాని పవన్ డైరెక్టర్, హీరోయిన్ సెంటిమెంట్.. కలిసి పనిచేయడం వల్ల బ్రేక్ అవుతుందో చూడాలి. 'అ..ఆ..' మే 6న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments