ఈనెల 12 న గుంటూరులో అఆ విజయోత్సవ వేడుక
Friday, June 10, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ లతో రూపొందిన చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన అఆ చిత్రం ఘన విజయం సాధించిన విషయం విదితమే.
ఈ చిత్రం సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకొని ఈ నెల 12 న గుంటూరు లో అ ఆ విజయోత్సవ వేడుకను జరుపనున్నట్లు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన గుంటూరు లోని సిద్ధార్ధ గార్డెన్స్ లో ఈనెల 12 సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ విజయోత్సవ వేడుకలో మాటల మాంత్రికుడు,దర్శకుడు త్రివిక్రమ్, హీరో నితిన్, సమంత,అనుపమ.నదియ,నరేష్,రావు రమేష్ ,అజయ్,హరితేజ, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్,మధునందన్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య, ల తో పాటు పలువురు నటీ నటులు, సాంకేతిక నిపుణులు, పలువురు రాజకీయనాయకులు పాల్గొంటున్నట్లు నిర్మాత తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments