అ ఆ టీజర్ రిలీజ్..
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం అ ఆ. అనసూయ రామలింగం వెర్షెస్ ఆనందవిహారి అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన సమంత, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియోను త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమా టీజర్ ను ఈరోజు సాయంత్రం 5 గంటల 2 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. అ ఆ ఆడియో రిలీజ్ ఎప్పుడనేది ఈ రోజు రిలీజ్ చేసే టీజర్ ద్వారా తెలియచేయనున్నారు. రొమాంటికి్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments