నాలుగవ స్ధానంలో అ ఆ.
Send us your feedback to audioarticles@vaarta.com
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన తాజా చిత్రం అ ఆ. నితిన్, సమంత జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించారు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన అ ఆ అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.
ముఖ్యంగా ఓవర్ సీస్ లో అ ఆ ఊహించని కలెక్షన్స్ సాధిస్తూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఓవర్ సీస్ లో బాహుబలి $6.9, శ్రీమంతుడు $2.9, నాన్నకు ప్రేమతో $2.02 మొదటి మూడు స్థానాల్లో నిలవగా $2 మిలియన్ సాధించి అ ఆ నాలుగవ స్ధానంలో నిలవడం విశేషం. అదీ కూడా అ ఆ రిలీజైన పది రోజుల్లోనే 2 మిలియన్ క్లబ్ లో చేరడం మరో విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments