ఆ విధంగా 'అ..ఆ..' అతనికి స్పెషలే
Send us your feedback to audioarticles@vaarta.com
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఎనిమిదవ చిత్రం 'అ..ఆ..'. నితిన్, సమంత తొలిసారిగా జోడీకట్టిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ మరో హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ సంగీతంలో విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో రూపొందిన ఈ చిత్రం నితిన్ కెరీర్‌కి ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ.. పోస్టర్స్, ట్రైలర్ చూసిన వారంతా ఒకటే మాట అంటున్నారు నితిన్ గురించి.
అదేమిటంటే.. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ నితిన్ ఇంత గ్లామర్ గా కనిపించలేదన్నది. ఆ విధంగా చూసుకుంటే నితిన్ కి 'అ..ఆ ..' స్పెషల్ మూవీనే. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు త్రివిక్రమ్ కే చెందుతుంది. ఈ చిత్రంలో నితిన్ కేవలం గ్లామర్ కే పరిమితమవుతాడో లేదంటే నటనలోనూ సత్తా చూపిస్తాడో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com