అ ఆ ఓ అద్భుతం - దిల్ రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్, సమంత జంటగా నటించిన చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించిన అ ఆ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...జూన్ నెలలో సాధారణంగా పెద్ద సినిమాలను రిలీజ్ చేయరు. ఎందుకంటే...స్కూల్లు.. కాలేజీలు ఓపెన్ చేస్తారు కనుక కలెక్షన్స్ అంతగా ఉండవు. అయితే...జూన్ లో సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్స్ ఉండవు అనేదాన్ని బ్రేక్ చేస్తూ ఆన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుంది అఆ. 5 రోజుల్లోనే 12 కోట్లు గ్రాస్ రావడం అనేది అద్భుతం. ఈ సినిమా ఇంకా ఏరేంజ్ కి వెళుతుంది అనేది ఇప్పుడే చెప్పలేం. నితిన్ కెరీర్ కి బిగ్ టర్నింగ్ పాయింట్ ఇది.
నా మిత్రుడు చినబాబు బ్యానర్ లో ఇంత పెద్ద సక్సెస్ రావడం హ్యాపీగా ఉంది. అ ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ పెట్టిన పెట్టుబడి వారం రోజుల్లోనే వచ్చేస్తుంది. ఈమధ్య కాలంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. తెలుగు ఆడియన్స్ కి మన నేటివిటీని గుర్తు చేసేలా ఎ టు జడ్ సినిమా ఎలా ఉండాలనుకున్నారో త్రివిక్రమ్ అలా తెరకెక్కించారు. నిర్మాత రాధాకృష్ణ ఏమాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓవర్ సీస్ లో 5 రోజుల్లోనే 2 మిలియన్ మార్క్ ను అందుకోవడం అనేది వండర్. ఈనెలాఖరు వరకు ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగుతాయి అనుకుంటున్నాను. నా అంచనా ప్రకారం అ ఆ 60 కోట్ల మార్క్ ను దాటుతుంది. సినిమా బాగుంటే అందులో ఎవరున్నారని చూడకుండా విజయాన్ని అందిస్తున్నతెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments