అఆ దిద్దిన ఆగస్టు
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాదిలో ఆగస్టు నెల టాలీవుడ్‌కి బాగానే కలిసొచ్చింది. నేనే రాజు నేనే మంత్రి, ఆనందో బ్రహ్మ, అర్జున్ రెడ్డి.. ఇలా మూడు బ్లాక్బస్టర్లు నమోదయ్యాయి. అయితే నేనే రాజు నేనే మంత్రి స్టార్ ఎట్రాక్షన్, స్టార్ డైరెక్టర్ తో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తే.. ఆనందో బ్రహ్మ, అర్జున్ రెడ్డి మాత్రం కేవలం కంటెంట్‌తోనే ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించి విజయం సాధించాయి.
అంతేకాకుండా.. ఓవర్సీస్లోనూ ఈ చిత్రాలకు బ్రహ్మరథం పట్టారు అక్కడి ప్రేక్షకులు. ఈ రెండు సినిమాల విజయం మరిన్ని లో బడ్జెట్ చిత్రాలకు ఊపిరి పోసింది. ఏదేమైనా.. ఆగస్టు నెల అఆ (అర్జున్ రెడ్డి, ఆనందోబ్రహ్మ) దిద్ది చిన్న సినిమాల దర్శకనిర్మాతలకు 'మంచి కంటెంట్‌తో సినిమాని రూపొందిస్తే.. విజయం ఖాయం' అనే సందేశాన్ని చేరవేసిందని చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout