అ ఆ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్..
Tuesday, April 26, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నితిన్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం అ ఆ. ఈ చిత్రంలో నితిన్ సరసన సమంత కథానాయికగా నటించింది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న అ ఆ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మిక్కి జే మేయర్ సంగీతం అందించిన అ ఆ ఆడియోను మే 2న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు.
హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ చిత్రంలో నటుడు & దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఓ ముఖ్యపాత్ర పోషించినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాథాకృష్ణ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న అ ఆ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments