99 వెహికిల్స్ పై బాలయ్య ఫ్యాన్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్. ఈ చిత్రాన్నిశ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి ఈ చిత్రాన్నినిర్మిస్తుంది. ఇటీవల జరిగిన షూటింగ్ తో టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష నటిస్తున్నారు. కడుపుబ్బా నవ్వించే కామెడీతో పాటు ఉత్కంఠ కలిగించే యాక్షన్ అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుందట.
ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో డిక్టేటర్ ఆడియో వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఆడియో వేడుకకు హైదరాబాద్ నుంచి అభిమానులు 99 వెహికిల్స్ పై వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బాలయ్య 99వ సినిమా కావడంతో 99 వెహికిల్స్ పై ఫ్యాన్స్ అమరావతి వెళ్లనుండడం విశేషం. అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో ఎంతో ఆసక్తి కలిగిస్తున్న డిక్టేటర్ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com