ఏపీలో కొత్తగా 9544 కరోనా కేసులు..

  • IndiaGlitz, [Friday,August 21 2020]

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ మరణాలు సైతం వందకు చేరువలో నమోదవుతూ ప్రజానీకాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. శుక్రవారం ఏపీ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 55,010 శాంపిళ్లను పరీక్షించగా.. 9544 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,34,940కు చేరిందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 91 మంది మృతి చెందగా.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 3,092కు పెరిగింది. అయితే గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 16 మంది, పశ్చిమ గోదావరిలో 13 మంది, నెల్లూరులో 12 మంది, తూర్పు గోదావరిలో 11 మంది, అనంతపురంలో 8 మంది, కడపలో ఏడుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, కర్నూలులో ముగ్గురు కరోనా కారణంగా మృతి చెందారు.

అయితే శుక్రవారం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య సైతం భారీగానే ఉంది. 8827 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 2,44,045 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 87,803 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఏపీలో 31,29,857 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా నేడు అత్యధికంగా తూర్పు గోదావరిలో 1312 కేసులు నమోదవగా.. పశ్చిమ గోదావరిలో 1131, చిత్తూరులో 1103 కేసులు నమోదయ్యాయి.

More News

బియర్ గ్రిల్స్‌.. ఇప్పుడు అక్ష‌య్ వంతు

డిస్క‌వ‌రీ ఛానెల్‌ను చాలా మంది ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డి చూస్తుంటారు.

సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం...

శ్రీశైలం పవర్ ప్లాంటు ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను తక్షణమే వెలికి తీయాలని..

సుశాంత్ వంట మనిషి విచారించిన సీబీఐ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి పెను సంచలనానికి తెరదీసిన విషయం తెలిసిందే.

'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది' టైటిల్ లుక్ విడుదల

కామెడీ హీరో షకలక శంకర్ లీడ్ రోల్ లో మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణ లో రూపొందిన అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ హారర్  కామెడీ

ఇది శాశ్వతం కాదు. తాత్కాలిక కష్టమే.. ప్లీజ్.. ప్లీజ్: చిరంజీవి

ఏవో చిన్నాచితకా సినిమాలు తప్ప పెద్దగా షూటింగ్స్ ఏమీ మొదలు కాలేదు. దీంతో సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.