Swati Teacher:#90s వెబ్‌సిరీస్ దర్శకుడి నుంచి 'స్వాతి టీచర్' మూవీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల ‘#90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ తెలుగు వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 1990ల వాతావరణంలో తెరకెక్కిన ఈ సిరీస్‌కు అనూహ్య స్పందన లభించింది. సీనియర్ నటుడు శివాజీ, వాసుకీ, మౌళి, తనూజ్ ప్రశాంత్, వాసంతిక, రోహన్ రాయ్ నటన ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా తండ్రి పాత్రలో శివాజీ నటన అందరినీ మెప్పించింది. అలాగే పిల్లలుగా మౌళి, తనూజ్ యాక్టింగ్ కూడా కడుపుబ్బా నవ్వించింది. ఈ వెబ్ సిరీస్‌ని ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సిరీస్ తరువాత ఈ దర్శకుడి నుంచి ‘ స్వాతి టీచర్’ అనే మూవీ రాబోతుంది.
తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను విడుదలచేశారు. ఇందులో కలర్స్ స్వాతి టీచర్ పాత్రలో నటిస్తున్నారు. నిఖిల్ దేవాదుల, నిత్యశ్రీ, రాజేంద్ర గౌడ్, సిద్ధార్థ్, హర్ష, పవన్ రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే నవ్వుల జల్లుతో తెరకెక్కుతోందన్నారు మేకర్స్. తెలంగాణలోని అంకాపూర్ అనే గ్రామంలో ఉన్న ముగ్గురు డల్ స్టూడెంట్స్‌కి సంబంధించిన కథ ఇది అని తెలిపారు. అడ్డూ అదుపూ లేకుండా అల్లరి చేసే ముగ్గురు విద్యార్థులు టీచర్ని కలిసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది హృద్యంగా ఉంటుందన్నారు. సరదా సన్నివేశాలు, సంభాషణలు, అందమైన, అమాయకమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ప్రయాణం... ప్రేక్షకుల మనసులను టచ్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈ మూవీతో దర్శకుడు ఆదిత్య హాసన్ ఎలాంటి మ్యాజిక్‌ని క్రియేట్ చేస్తారో చూడాలి. #90s ని నిర్మించిన నవీన్ మేడారం ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మేడారం నవీన్ అఫిషియల్ ప్రొడక్షన్స్ సంస్థ మీద ఈ మూవీ నిర్మిస్తున్నారు.
నటీనటులు: స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి), నిఖిల్ దేవాదుల (బాహుబలి ఫేమ్), నిత్యశ్రీ (కేరాఫ్ కంచరపాళెం ఫేమ్), రాజేంద్ర గౌడ్, సిద్ధార్థ్ (90స్ ఫేమ్), హర్ష, పవన్ రమేష్, నరేందర్ నాగులూరి, సురేష్, తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com