ఏపీలో కొత్తగా 8943 కరోనా కేసులు..

  • IndiaGlitz, [Friday,August 14 2020]

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీకి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం ఏపీలో గడిచిన 24 గంటల్లో 53,026 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 8,943 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,73,085కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 97 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ ఏపీలో మొత్తం 2475 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 89,907 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 9779 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ మొత్తం 1,80,703 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 27,58,485 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనాతో కర్నూలు జిల్లాలో 12 మంది, చిత్తూరులో 10, తూర్పుగోదావరి 10, గుంటూరు 10, పశ్చిమ గోదావరి 10, నెల్లూరు 10, అనంతపురం ఆరుగురు, కడప ఆరుగురు, ప్రకాశం ఆరుగురు, శ్రీకాకుళం ఆరుగురు, విశాఖపట్నం ఆరుగురు, విజయనగరం ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు కరోనాతో మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్‌..!!

ఒక వైపు ద‌ర్శ‌క‌త్వంతో పాటు నిర్మాణంలో చురుకుగా ఉండే వ్య‌క్తుల్లో జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఒక‌రు. య‌న్టీఆర్ క‌థానాయ‌కుడు,

ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే...

ప్రవేశ పరీక్షలపై ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు పరీక్షల తేదీలను కూడా వెల్లడించింది.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమం..

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 5న ఆయనకు కరోనా సోకింది.

ప‌వ‌న్ 29 ఖ‌రారైందా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో ఉంటూనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ముందుగా పింక్ రీమేక్ వ‌కీల్‌సాబ్ రీమేక్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

శంఖం ఊదుతూ బురదలో కూర్చుంటే కరోనా సోకదు: బీజేపీ ఎంపీ

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడిపోయింది.