ఏపీలో కొత్తగా 8943 కరోనా కేసులు..
- IndiaGlitz, [Friday,August 14 2020]
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీకి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం ఏపీలో గడిచిన 24 గంటల్లో 53,026 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 8,943 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,73,085కి చేరుకుంది.
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 97 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ ఏపీలో మొత్తం 2475 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 89,907 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 9779 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ మొత్తం 1,80,703 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 27,58,485 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనాతో కర్నూలు జిల్లాలో 12 మంది, చిత్తూరులో 10, తూర్పుగోదావరి 10, గుంటూరు 10, పశ్చిమ గోదావరి 10, నెల్లూరు 10, అనంతపురం ఆరుగురు, కడప ఆరుగురు, ప్రకాశం ఆరుగురు, శ్రీకాకుళం ఆరుగురు, విశాఖపట్నం ఆరుగురు, విజయనగరం ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు కరోనాతో మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
#COVIDUpdates: 14/08/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) August 14, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2,70,190 పాజిటివ్ కేసు లకు గాను
*1,77,808 మంది డిశ్చార్జ్ కాగా
*2,475 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 89,907#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/6HJw9XK4Px