సిబ్బంది నిర్వాకం.. బ్యాంక్‌కు తాళం, 18 గంటల పాటు లాకర్‌ గదిలో వృద్ధుడి నరకయాతన

  • IndiaGlitz, [Tuesday,March 29 2022]

బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధుడు రాత్రంతా బ్యాంక్ లాకర్‌లో వుండాల్సి వచ్చింది. ఆయనను లోపలే వుంచి బ్యాంక్‌కు తాళం వేసి వెళ్లారు . వివరాల్లోకి వెళితే.. సోమవారం సాయంత్రం 4.20 గం.కు కృష్ణారెడ్డి (87) అనే వృద్ధుడు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని యూనియన్ బ్యాంకుకు వెళ్లారు.

అనంతరం బ్యాంక్‌ లోపల తనకు కేటాయించిన లాకర్ వద్దకు వెళ్లాడు. అయితే బ్యాంక్ వేళలు ముగియడంతో వృద్ధుడు కృష్ణారెడ్డిని... గమనించకుండానే సిబ్బంది తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. చీకటిపడినా వృద్ధుడు ఇంటికి రాకపోవడంతో కృష్ణారెడ్డి కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులకు అనుమానం రావడంతో సీసీటీవీ ఫుటేజ్ చూసి బ్యాంకు లాకర్ గదిలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఉదయం 10 గంటలకు బ్యాంకు లాకర్ నుంచి ఆ వృద్ధుడిని పోలీసులు బయటకు తీసుకొచ్చారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంపై కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షుగర్, రక్తపోటు సమస్యలతో కృష్ణారెడ్డి బాధపడుతుండటంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త వైరల్ అవుతుండగా.. బ్యాంక్‌ సిబ్బందిపై నెటిజన్లు ఫైరవుతున్నారు.

More News

సురేష్ గోపీ న్యూలుక్.. ‘మీది గడ్డమా? మాస్కా?’ , రాజ్యసభలో నవ్వులు పూయించిన వెంకయ్య నాయుడు

దేశ భవితను నిర్దేశించే చట్ట సభల్లో ఇటీవలి కాలంలో వాగ్వాదాలకు, పరస్పర ఆరోపణలకు, ముష్టి యుద్ధాలకు వేదికగా నిలుస్తోంది.

సెట్‌లో ‘వెల్‌కమ్ సాయితేజ్’ అంటూ ఫ్లకార్డ్స్.. కంటతడి పెట్టిన మెగా మేనల్లుడు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

ఏపీలో ఆన్‌లైన్ టికెట్ల విక్రయానికి ఏర్పాట్లు.. ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి, రేసులో ‘అల్లు’ సంస్థ

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లకు సంబంధించి జగన్ సర్కార్ మరో ముందడుగు వేసింది.

రూపాయి.. రూపాయి దాచుకుని రూ. 2.6 లక్షల పోగేసి .. డ్రీమ్ బైక్ కొన్న యువకుడు

చిన్నప్పుడు మనకు నచ్చిన వస్తువు అమ్మానాన్న కొనివ్వలేదు అనుకోండి.. అప్పుడేం చేసేవాళ్లం..

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... లాక్‌డౌన్ పరిధిలోకి కీలక నగరం

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి అదుపులోనే వుంది. కానీ కరోనా పుట్టినిల్లు చైనాలో మాత్రం వైరస్ విజృంభిస్తోంది.