సిబ్బంది నిర్వాకం.. బ్యాంక్‌కు తాళం, 18 గంటల పాటు లాకర్ గదిలో వృద్ధుడి నరకయాతన
Send us your feedback to audioarticles@vaarta.com
బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధుడు రాత్రంతా బ్యాంక్ లాకర్‌లో వుండాల్సి వచ్చింది. ఆయనను లోపలే వుంచి బ్యాంక్‌కు తాళం వేసి వెళ్లారు . వివరాల్లోకి వెళితే.. సోమవారం సాయంత్రం 4.20 గం.కు కృష్ణారెడ్డి (87) అనే వృద్ధుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని యూనియన్ బ్యాంకుకు వెళ్లారు.
అనంతరం బ్యాంక్ లోపల తనకు కేటాయించిన లాకర్ వద్దకు వెళ్లాడు. అయితే బ్యాంక్ వేళలు ముగియడంతో వృద్ధుడు కృష్ణారెడ్డిని... గమనించకుండానే సిబ్బంది తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. చీకటిపడినా వృద్ధుడు ఇంటికి రాకపోవడంతో కృష్ణారెడ్డి కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులకు అనుమానం రావడంతో సీసీటీవీ ఫుటేజ్ చూసి బ్యాంకు లాకర్ గదిలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఉదయం 10 గంటలకు బ్యాంకు లాకర్ నుంచి ఆ వృద్ధుడిని పోలీసులు బయటకు తీసుకొచ్చారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంపై కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షుగర్, రక్తపోటు సమస్యలతో కృష్ణారెడ్డి బాధపడుతుండటంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త వైరల్ అవుతుండగా.. బ్యాంక్ సిబ్బందిపై నెటిజన్లు ఫైరవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout