86 వసంతాల తెలుగు సినిమా పుస్తకం 200 ప్రతులు మా నటీనటుల సంఘంకు బహూకరణ 

  • IndiaGlitz, [Wednesday,May 15 2019]

రెండు దశాబ్దాల ఫిలిం అనలిటికల్‌ అండ్‌ అప్రిసియేషన్‌ (ఫాస్‌) అధ్యక్షులు డా. కె. ధర్మారావు కృషితో, ఫాస్‌ ముద్రించిన మరియు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన '' 86 వసంతాల తెలుగు సినిమా '' పుస్తకం 1932 నుండి 2018 వరకు తెలుగు సినిమా ఎన్‌ సైక్లోపీడియా 200 ప్రతులు మా నటీనటుల సంఘంకు బహూకరణ మహోత్సవం హైదరాబాద్‌ ఫిలింఛాంబర్‌లో ఈ రోజు మే 15 (బుధవారం) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఎంపి మురళీమోహన్‌, మా అధ్యక్షులు నరేష్‌ వి కె, ప్రముఖ సినీ రచయిత డా. పరుచూరి గోపాల కృష్ణ, సినీ విజ్ఞానవిశారద ఎస్‌ వి రామారావు, ప్రముఖ సినీ నటులు, రచయిత రావి కొండలరావు, డా. కే వి రమణ చారి పాల్గొన్నారు. ముఖ్య అతిధులను ఫాస్‌ అధ్యక్షుడు కె ధర్మారావు శాలువాలతో సత్కరించారు..

ఈ సందర్భంగా  సినీ విజ్ఞాన విశారద ఎస్‌ వి రామారావు మాట్లాడుతూ - ''ఒక రకంగా ''86 వసంతాల తెలుగు సినిమా'' పుస్తకం తెలుగు ప్రేక్షకులకు పెద్ద బాలశిక్ష అనుకోవాలి, నూతనంగా సినిమాలు నిర్మించాలనుకునే దర్శక నిర్మాతలకు కావాల్సిన అన్ని అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. తెలుగులో దాదాపు 50 మంది రచయితలు 200 పుస్తకాలకు పైగా రాశారు, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంభందించి ఇన్ఫర్మేషన్‌ ఓరియెంటెడ్‌ బుక్‌ ఇది. ఇంత డీటైల్డ్‌గా మరే పుస్తకం లేదు'' అన్నారు

టిఎఫ్‌ డి సి చైర్మన్‌ పి. రామ్‌ మోహన రావు మాట్లాడుతూ - ''ధర్మారావు గారి పుస్తకం ఒక ఎన్‌ సైక్లోపీడియా. సినిమా రంగం మీద ఇంట్రెస్ట్‌ ఉన్న ప్రతి ఒక్కరూఈ పుస్తకాన్ని రిఫరెన్స్‌గా తీసుకోవచ్చు. అంత అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి మా టి ఎస్‌ఎఫ్‌ డి సి తరపున కావాల్సిన సహాయం అందిస్తామని సభాముఖంగా తెలీయజేస్తున్నాను'' అన్నారు. 

మాజీ ఎంపి మురళిమోహన్‌ మాట్లాడుతూ - ''ధర్మారావు గారు నాకు చాలా కాలంగా తెలుసు. మంచి ఆలోచన 1932 నుండి సినిమా రంగంలో వచ్చిన అన్ని మార్పులను చాలా విశ్లేషంగా తెలియజేసారు. ఇందులో నా పాత్ర కూడా వుంటుందనే ఆశిస్తున్నాను. అలాగే ఈ పుస్తకాన్ని మా సభ్యులకు బహుకరించడం అనేది చాలా గొప్ప ఆలోచన. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిలో తన పేరు నిలుస్తుంది. 86 వసంతాల తెలుగు సినిమా చరిత్రను రాసిన ధర్మారావు గారిని అభినందిస్తూ ఆయన ప్రస్థానం 100 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్ర వరకు కొనసాగించాలని కోరుకుంటున్నాను'' అన్నారు. 

మా అధ్యక్షుడు నరేష్‌ వి కె మాట్లాడుతూ - ''చరిత్రలో నిలిచిపోయే పుస్తకాన్ని రచించిన ధర్మారావు గారికి మా తరపున ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని మా సభ్యులందరి ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెస్తాము. ఇలాంటిపుస్తకాలకు మరింత ప్రజాదరణ అవసరం. మా సంగం తరపున ఈ పుస్తకానికి తగిన సాయం చేస్తాను అలాగే ఇక్కడికి వచ్చిన అతిరధమహానుభావులందరికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అన్నారు. 

ప్రముఖ రైటర్‌ పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - ''నన్ను ఇక్కడికి అతిధిగా పిలిస్తే వచ్చాను. ధర్మారావు గారు అందరికి పుస్తకం ఇచ్చి నాకు మాత్రం ఇవ్వలేదు బహుశా నేనే ఒక పుస్తకం అనుకోని ఉండవచ్చు. చాలా గొప్ప ప్రయత్నం. చాలా ఓపిక కావలి, అలానే పూర్తి వివరాలు సేకరించాలి. అలా అన్ని వివరాలు ఎంతో ఓపికతో సేకరించి ఈ పుస్తకాన్ని తెలుగు ప్రజలకి అందిస్తున్న ధర్మారావు గారికి నిజంగా నా ధన్యవాదాలు. ఆయన ఇలాంటిపుస్తకాలు మరెన్నో అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నాను'' అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో లయన్‌ ఏ విజయ్‌ కుమార్‌, శిరోమణి వంశి రామరాజు, సీనియర్‌ నటి గీతాంజలి, కృష్ణవేణి, నిర్మాత బి ఏ రాజు, నిర్మాత సురేష్‌ కొండేటి, సీనియర్‌ పాత్రికేయులు ప్రభు తదితరులు పాల్గొన్నారు.... 

More News

హైదరాబాద్‌లో వరల్డ్ బిగ్గెస్ట్ వన్‌ ప్లస్ స్టోర్ నిర్మాణం

హైదరాబాద్‌లో అతిపెద్ద స్టోర్ ప్రారంభించడానికి చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ, ఐటీ హబ్‌గా హైదరాబాద్ మారుతుండటం ఎంతో ప్రత్యేకమని వన్ ప్లస్ సంస్థ

చిక్కిపోతున్న ‘చంద్రుడు’.. పెను ప్రమాదం తప్పదా!?

చందమామ రోజురోజుకు చిక్కిపోతున్నాడు. అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.. మున్ముంథు పెను ప్రమాదం తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ ఇవ్వలేదు.. ఎవ్వరినీ వదలం!

టాలీవుడ్‌ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపిన డ్రగ్స్ కేసులో హీరో, హీరోయిన్లు, డైరెక్టర్ల, ఆర్టిస్టులందరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు మంగళవారం రోజు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

'ఇస్మార్ట్ శంకర్'.. పక్కా ఊర మాస్..! (టీజర్ రివ్యూ)

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పుట్టిన రోజు నేడు. నేటితో రామ్.. 31వ పడిలోకి అడుగుపెడుతున్నాడు.

డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల మీదుగా 'శివరంజని' ట్రైలర్ విడుదల

ఆకట్టుకునే కంటెంట్ ఉంటే హారర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నారు.