RRRలో ఈ సీన్స్ కోసం 85 కోట్ల బడ్జెట్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా RRRను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకూ చిన్న పాటి లుక్‌గానీ.. కనీసం ఆర్ఆర్ఆర్‌కు అర్థమేంటో కూడా దర్శకుడు చెప్పకపోవడం గమనార్హం. ఇవన్నీ అటుంచితే ఈ ఏడాది జూన్ లేదా జులైలో సినిమా రిలీజ్ అవుతుందని ఇదివరకే ప్రకటించిన జక్కన్నా.. తీరా చూస్తే వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట్లో.. ఫిల్మ్‌నగర్‌లో వైరల్ అవుతోంది.
కీలక సన్నివేశాల కోసం..!
ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తి అయ్యింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న జక్కన్న.. త్వరలోనే పూణేలో షూటింగ్‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి మహారాష్ట్ర అటవీ శాఖ నుంచి అన్ని అనుమతులు లభించాయని తెలుస్తోంది. కాగా ఇక్కడ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై క్లైమాక్స్ ఫైట్‌తో పాటు.. ఇద్దరి మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. కాగా.. ఈ సీన్స్ కోసమే ఐదు పది కాదు ఏకంగా రూ. 85 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
గుడ్ న్యూస్!
ఇదిలా ఉంటే.. ఉగాది కానుకగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, చెర్రీ పుట్టిన రోజు ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశాలున్నాయి. అంతేకాదు.. శ్రీరామనవమి రోజున చిత్రానికి సంబంధించిన మొదటి పాటను కూడా విడుదల చేయాలనే ప్లాన్‌లో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మెగా, నందమూరి, జక్కన్న అభిమానులకు శుభవార్తే. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments