ఎనిమిదోసారి అపూర్వ క‌ల‌యిక‌

  • IndiaGlitz, [Tuesday,November 21 2017]

మ‌న సీనియ‌ర్ హీరో హీరోయిన్స్‌..అంటే 80 ద‌శ‌కంలో న‌టించిన తారలంద‌రూ ఈ మ‌ధ్య ఏడాకి కలుసుకుంటారు. ఈ క‌ల‌యిక‌కి ఓ ప్ర‌దేశాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఈ గెట్ టుగెద‌ర్‌కి ఓ పేరు కూడా పెట్టుకున్నారు. ఆ పేరే '80స్ సౌత్ యాక్టర్స్ రీ యూనియున్'.

అందులో భాగంగా అందరూ ఒకే రంగు దుస్తులతో సందడి చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్కో సంవత్సరం ఒక్కో రంగు దుస్తులు ధరిస్తారు. ఈ సంవత్సరం తారలంతా వంగ పువ్వు రంగు దుస్తులతో కనిపించారు.

నవంబర్ 17 నుండి 19 వ‌ర‌కు మహాబలిపురంలో ఈ వేడుక జరిగింది. మెుత్తం 28 వుంది సినీ తారలు ఎనిమిదోసారి ఇలా కలుసుకున్నారు.