రెండు తేదీలు.. ఎనిమిది జోన‌ర్స్‌

  • IndiaGlitz, [Friday,December 15 2017]

సంక్రాంతి పండగ వచ్చిందంటే సాధారణ ప్రజానీకం నుంచి సినీ ఇండస్ట్రీ వరకు అందరికీ పండగే. ఈ సంక్రాంతికి పవన్ కల్యాణ్, బాలకృష్ణ, రవితేజ వంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు తమిళ స్టార్ హీరో సూర్య కూడా తెలుగుతెరపై సందడి చేయనున్నారు. ఈ సారి సంక్రాంతిలాగే జాతీయ పండుగ జనవరి 26, అలాగే మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్రవరి 9న కూడా చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ చిత్రాలన్నీ కూడా వేటికవే ప్రత్యేకమైనవి కావ‌డం విశేషం.

ఒక్కొక్క జోనర్లో రాబోతున్న ఈ సినిమాలపై ఒక కన్నేస్తే.. జనవరి 26న అనుష్క-అశోక్ (ద‌ర్శ‌కుడు) 'భాగమతి' (థ్రిల్లర్ మూవీ), మంచు విష్ణు-జి.నాగేశ్వర రెడ్డి (ద‌ర్శ‌కుడు) 'ఆచారి అమెరికా యాత్ర' (కామెడీ ఎంటర్‌టైనర్), సందీప్ కిషన్-మంజుల ఘ‌ట్ట‌మ‌నేని (ద‌ర్శ‌కురాలు) 'మనసుకు నచ్చింది' (లవ్,రొమాంటిక్ చిత్రం), విశాల్-పి.ఎస్.మిత్రన్ (ద‌ర్శ‌కుడు) 'అభిమన్యుడు' (యాక్షన్ థ్రిల్లర్), కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో న‌టించిన‌ 'విశ్వరూపంII' (స్పై థ్రిల్లర్) రిలీజ్ కానుండ‌గా.. ఫిబ్రవరి 9న వరుణ్ తేజ్-వెంకీ అట్లూరి (ద‌ర్శ‌కుడు) 'తొలిప్రేమ' (రొమాంటిక్ ఎంటర్‌టైనర్), మోహన్ బాబు-మదన్ (ద‌ర్శ‌కుడు) 'గాయత్రి' (ఫ్యామిలీ డ్రామా), నిఖిల్-శరణ్ కొప్పిశెట్టి (ద‌ర్శ‌కుడు) 'కిర్రక్ పార్టీ' (యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్) విడుద‌ల అవుతున్నాయి.

ఇలా ఈ రెండు తేదీల్లో ఎనిమిది వేరువేరు జోనర్ల సినిమాలు విడుదల కానున్నాయి.

More News

జై సింహా చిత్రీకరణ పూర్తి - జనవరి 12న విడుదల

నందమూరి బాలకృష్ణ,నయనతార,నటాషా జోషి,హరిప్రియ ప్రధాన పాత్రధారులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో

విష్ణుకిదే తొలిసారి..

గతంలో మన తెలుగు కథానాయకులు సంవత్సరానికి నాలుగు లేదా ఐదు సినిమాలతో సందడి చేసేవారు.

శివకాశీపురం సాంగ్ లాంచ్ చేసిన తెలంగాణ ఎఫ్ డిసి చైర్మన్

సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాస్టర్ హరి సమర్పణలో హరీష్ వట్టి కూటి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మోహన్ బాబు పులిమామిడి నిర్మిస్తున్న చిత్రం  'శివకాశీపురం'. స్వర్గీయ స్వర చక్రవర్తి మనవడు , శ్రీ తనయుడు అయిన రాజేష్ శ్రీ చక్రవర్తి ని ఈ చిత్రంతో హీరోగా పరిచయం చేస్తున్నారు .

అంజలి ప్రధాన పాత్రలో, రాయ్ లక్ష్మి కీలక పాత్రలో ఆర్ కె స్టూడియోస్ బ్యానర్ ద్విభాషా చిత్రం

గుంటూరు టాకీస్,రాజా మీరు కేక వంటి వినోదాత్మక చిత్రాలను,షూటింగ్ దశలో ఉన్న పవనిజం-2 వంటి చిత్రాలను తెరకెక్కించిన

'బాహుబలి' సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విడుదల చేసిన 'లాయల్‌ ఎల్‌.ఇ.డి.' లైట్స్‌

శ్రీ బాలాజీ వీడియోస్‌ ద్వారా 300కు పైగా తెలుగు సినిమాలను విడుదల చేసిన నిరంజన్‌ పన్సారి వీడియో రంగంలో