కర్ణాటకలో ఘోర  రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం, చెల్లాచెదురుగా మృతదేహాలు

  • IndiaGlitz, [Saturday,March 19 2022]

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలవ్వగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. తుమకూరు సమీపంలోని పావగడ తాలూకా పలవలహళ్లి క్రాస్ వద్ద బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. రోడ్డు మలుపు వద్ద బస్సును టర్న్ చేసే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారో తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతులంతా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్‌గా చెబుతున్నారు. వై.ఎన్‌.హొసకోట నుంచి పావగడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న బస్సు టాప్‌పై ఎక్కువ మంది డిగ్రీ విద్యార్థులున్నట్లు సమాచారం. మృతుల్లో పై నుంచి దూకిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన షాన్‌వాజ్‌ (20) మృతి చెందారు. కంబదూరు మండలం బెస్తరపల్లిలో ఇతను మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రత నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు.

More News

సమ్మక్క- సారక్కలపై వ్యాఖ్యలు ... స్పందించిన చిన్నజీయర్

ఆదివాసి దేవతలైన సమ్కక్క- సారక్కలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ జరుగుతున్న ప్రచారంపై చినజీయర్ స్వామి స్పందించారు.

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు.. కొత్తది ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న "శ్రీ శ్రీ శ్రీ రాజావారు'' ఫస్ట్ లుక్ విడుదల

ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు నార్నే నితిన్ ( జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు) కథానాయకుడిగా

‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి బెదిరింపులు.. కేంద్రం సీరియస్ , ‘వై’కేటగిరీ భద్రతకు గ్రీన్ సిగ్నల్

1990వ దశకంలో జమ్మూకాశ్మీర్‌లో చోటు చేసుకున్న కాశ్మీరి పండిట్ల ఊచకోతను ఆధారంగా చేసుకుని వివేక్ తెరకెక్కిన ‘‘ది కశ్మీర్ ఫైల్స్’’

భారత్‌కు పోటీగా మిస్సైల్ టెస్ట్.. పరువు పొగొట్టుకున్న పాక్, ఏం జరిగిందంటే..?

భారత్‌పై వీలు కుదిరినప్పుడల్లా అక్కసు వెళ్లగక్కే దాయాది దేశం పాకిస్తాన్ పరువు పొగొట్టుకుంటూనే వుంది.