కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం, చెల్లాచెదురుగా మృతదేహాలు
Send us your feedback to audioarticles@vaarta.com
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలవ్వగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. తుమకూరు సమీపంలోని పావగడ తాలూకా పలవలహళ్లి క్రాస్ వద్ద బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. రోడ్డు మలుపు వద్ద బస్సును టర్న్ చేసే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారో తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతులంతా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్‌గా చెబుతున్నారు. వై.ఎన్.హొసకోట నుంచి పావగడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న బస్సు టాప్‌పై ఎక్కువ మంది డిగ్రీ విద్యార్థులున్నట్లు సమాచారం. మృతుల్లో పై నుంచి దూకిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన షాన్వాజ్ (20) మృతి చెందారు. కంబదూరు మండలం బెస్తరపల్లిలో ఇతను మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రత నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments