20 నిమిషాల కోసం దాదాపూ రూ.8 కోట్లా?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ గత ఏడాది దబాంగ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాను ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. ఇప్పుడు మూడోసారి ప్రభుదేవాదర్శకత్వంలోనే సల్మాన్‌ఖాన్ రాధే అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `యువర్ మోస్ట్ వాంటెడ్ భాయి` దీనికి ఉపశీర్షిక. ఈ ఏడాది రంజాన్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్ 20 నిమిషాల పాటు ఉంటుంది. దుబాయ్, స్టూడియోలో వేసే భారీ సెట్‌లో ఈ క్లైమాక్స్‌లో ప్లాన్ చేశారు.
సల్మాన్‌ఖాన్, రణదీప్ హుడా మధ్య వచ్చే సన్నివేశం చిత్రీకరణ కోసం క్రోమా కీ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారట. ఈ విధానంలో బాహుబలి చిత్రాన్ని మాత్రమే చిత్రీకరించారు. ఈ సన్నివేశానికి దాదాపు రూ.8 కోట్లు ఖర్చు అవుతుందట. కానీ ఈ టెక్నాలజీలో చిత్రీకరిస్తే సీన్ ఎన్‌హెన్స్ అవుతుందని భావించిన నిర్మాతలు ఏమాత్రం ఆలోచించకుండా ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోయారట. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోన్నఈ చిత్రంలో జాక్వలైన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నారు. ఇక జాకీష్రాఫ్, తమిళ నటుడు భరత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com