బీరుట్లో భారీ పేలుళ్లు.. 78 మంది మృతి
- IndiaGlitz, [Wednesday,August 05 2020]
లెబనాన్ రాజధాని బీరుట్లో పేలుళ్లు అక్కడి ప్రజల వెన్నులో వణకు పుట్టించాయి. బీరుట్‌లోని ఓడరేవు పరిసరాల్లో పావుగంట వ్యవధిలోనే రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 78 మంది మృతి చెందగా.. దాదాపు 4 వేల మంది గాయపడ్డారు. పేలుళ్ల ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. భవన శిథిలాలాల కింద పలువురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. బీరుట్ పోర్టు కూడా పూర్తిగా ధ్వంసమైంది.
పేలుడు అనంతరం ఏర్పడిన దట్టమైన పొగ చుట్టు పక్కల ప్రాంతానికి సైతం విస్తరించడంతో తీవ్రత మరింత పెరిగింది. పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. బీరుట్ ఓడరేవులో టపాసులు నిల్వ చేసిన గిడ్డగిలో పేలుడు సంభవించినట్టు లోకల్ మీడియా తెలిపింది. పేలుళ్లకు గల కారణాలు తెలియరాలేదు. బాధితులకు సాయం అందించేందుకు అంబులెన్సులు రంగంలోకి దిగాయి. అత్యవసర నిధి కింద 100 బిలియన్ డాలర్లు విడుదల చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు.