ఒక్కరోజే తమిళనాడులో 743.. మహారాష్ట్రలో 2,250 కరోనా కేసులు

  • IndiaGlitz, [Thursday,May 21 2020]

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రోజురోజుకు విజృంభిస్తోంది. రోజుకు రోజుకూ కేసులు ఎక్కువ అవుతుండటం.. మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నైలో భారీగా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రజలు భయంతో బిక్కి బిక్కి బతుకుతున్నారు. ఈ తరుణంలో మరోసారి భారీగా కేసులు పెరిగిపోయాయి. బుధవారం ఒక్కరోజే తమిళనాడులో 743 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇవాళ కొత్తగా ముగ్గురు మరణించారని తెలిపింది. ఇవాళ నమోదైన కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 13,191కి చేరింది. ఇప్పటి వరకూ చనిపోయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 87 మంది కాగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,219 అని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కాగా బుధవారం ఒక్కరోజే కరోనాను జయించి 987 మంది డిశ్చార్జ్ కాగా.. మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,882కు చేరుకుంది.

మహారాష్ట్ర, తమిళనాడులో భారీగా..
వాస్తవానికి దేశ వ్యాప్తంగా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కరోనా కట్టిడికి తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. ఇక వ్యాక్సిన్ తప్ప మరో మార్గం లేదేమో..? అని అక్కడి అధికారులు సైతం చేతులెత్తేసినంత పనయ్యింది. అయితే.. తమిళనాడులో కేసులు తగ్గినట్లే తగ్గినప్పటికీ కోయంబోడు మార్కెట్ ఘటనతో ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతకు మునుపే మర్కజ్ ఘటన.. ఇలా వరుస ఘటనలతో భారీగా కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్ర విషయానికొస్తే.. ఇక్కడ కరోనా పంజా విసురుతోంది. బుధవారం కూడా రికార్డు స్థాయిలో 2,250 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం షాకింగ్‌కు గురిచేస్తున్నాయి. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 39,297కి చేరింది. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇక్కడ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24,118కి చేరగా.. ఇప్పటి వరకు 841 మంది మరణించడం కలవరపాటుకు గురయ్యే అంశం. ధారవీలో అయితే ఎన్నెన్ని కేసులు నమోదవుతున్నాయో అస్సలు లెక్కే లేకుండా పోయింది. దేశం మొత్తమ్మీద నమోదైన కేసుల్లో 70 శాతానికిపైగా ఇక్కడే నమోదవుతుండటం షాకింగ్ విషయం. రాష్ట్రంలో రోజురోజుకూ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో..? ఎలా పెరుగుతున్నాయో..? రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు దిక్కుతోచట్లేదు. మహాలో కరోనా కేసులు ఎప్పుడు కంట్రోల్‌ అవుతుందో ఏంటో మరి.

More News

వామ్మో.. ఈ నర్స్ మేడమ్ టూ హాట్ గురూ..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై డాక్టర్స్, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అలుపెరగని పోరాటం చేస్తు్న్నారు.

చిత్ర ప‌రిశ్ర‌మ కోసం మెగా మీటింగ్‌

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ప‌లు రంగాల్లో సినీ పరిశ్ర‌మ ముందు వ‌రుస‌లో ఉంది.

తెలంగాణలో ఇవాళ్టికి సేఫ్.. కొత్తగా 27 కేసులు!

తెలంగాణలో గత కొన్నిరోజులుగా చూస్తే కాస్త తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ్టికి సేఫ్‌ జోన్‌లోనే ఉన్నట్లే.

డిజిట‌ల్‌కు రానా త్రిభాషా చిత్రం

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావంతో సినీ రంగం కుదేలైంది.ముఖ్యంగా చిన్న సినిమాల ప‌రిస్థితి ఘోరంగా తయారైంది.

మంచి మనసు చాటుకున్న మంచు మనోజ్

కరోనా లాక్ డౌన్‌తో దేశ వ్యాప్తంగా ఉన్న వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.