బెంగాల్ 'అంఫన్' పెను బీభత్సం.. 72 మంది దుర్మరణం

  • IndiaGlitz, [Friday,May 22 2020]

సూపర్ సైక్లోన్ అంఫన్ గత రెండు మూడ్రోజులుగా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను కుదిపేస్తోంది. గురువారం నాడు ఈ తుఫాన్ మరింత ఉగ్రరూపం దాల్చి పెను బీభత్సం సృష్టించింది. ఈ భయంకర తుఫాన్‌తో బెంగాల్‌లో 72 మంది దుర్మరణం చెందారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.. తాను ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని కంటతడిపెట్టారు. ప్రధాని మోదీని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని దీదీ కోరారు. కాగా తుఫాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.2.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని మమత సర్కార్ ప్రకటించింది.

గంటకు 185 కి.మీ. వేగంతో..!ఈ తుఫాన్ థాటికి చాలా మంది నిరాశ్రయులు అవ్వగా.. వందలాది మంది గాయపడ్డారని సీఎం తెలిపారు. కాగా.. బుధవారం నుంచి బెంగాల్‌ ప్రజల్లో భయాందోళన మొదలైంది. తుఫాన్ తీరం దాటిన సమయంలో గంటకు 185 కి.మీ. వేగంతో భీకర గాలులు వీస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని డిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో నిన్న తీరం దాటింది. ఈ గాలులతో వేలాది ఇళ్లు నేలమట్టవ్వగా.. భారీ వృక్షాలు కూకటి వేర్లు సహా పెకిలించుకొని కుప్పకూలడం గమనార్హం. భారీ గాలులు, వర్షాలతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. మరోవైపు.. విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రస్తుతం పరిస్థితి క్రిటికల్‌గానే ఉంది. ఈ పరిస్థితి నుంచి ఆ రెండు రాష్ట్రాల పరిస్థితి ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు.

కేంద్రం స్పందన..

తుఫాన్ థాటికి అతలాకుతలమైన పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. కాగా.. సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారని.. తాము కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని మోదీ తెలిపారు. రెండు రాష్ట్రాల సీఎంలతో తాను మాట్లాడానని, అన్నివిధాలా ఆదుకుంటామని హోం మంత్రి అమిత్ షా అభయమిచ్చారు.

More News

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. లిక్కర్ డోర్ డెలివరీ!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్‌ విధించడంతో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకు ఇంటికే పరిమితం అయ్యారు.

ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల నుంచి పూర్తి జీతాలు ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

విమానం ఎక్కాలంటే ఈ కీలక మార్గదర్శకాలు పాటించాల్సిందే..!

మే-25 నుంచి భారతదేశంలో విమానయాన సేవలు తిరిగి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.

టాలీవుడ్‌ బెస్ట్‌గా ఉండాలన్నది కేసీఆర్ కోరిక : తలసాని

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ దర్శకనిర్మాతలు, సీనియర్ హీరోలు భేటీ అయ్యిన విషయం తెలిసిందే.

రికార్డ్ క్రియేట్ చేసిన తార‌క్ అభిమానులు!!

అగ్ర హీరోలు బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్‌తో దుమ్మురేపుతుంటే వారి అభిమానులు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు.