బెంగాల్ 'అంఫన్' పెను బీభత్సం.. 72 మంది దుర్మరణం
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ సైక్లోన్ అంఫన్ గత రెండు మూడ్రోజులుగా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను కుదిపేస్తోంది. గురువారం నాడు ఈ తుఫాన్ మరింత ఉగ్రరూపం దాల్చి పెను బీభత్సం సృష్టించింది. ఈ భయంకర తుఫాన్‌తో బెంగాల్లో 72 మంది దుర్మరణం చెందారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.. తాను ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని కంటతడిపెట్టారు. ప్రధాని మోదీని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని దీదీ కోరారు. కాగా తుఫాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.2.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని మమత సర్కార్ ప్రకటించింది.
గంటకు 185 కి.మీ. వేగంతో..!ఈ తుఫాన్ థాటికి చాలా మంది నిరాశ్రయులు అవ్వగా.. వందలాది మంది గాయపడ్డారని సీఎం తెలిపారు. కాగా.. బుధవారం నుంచి బెంగాల్ ప్రజల్లో భయాందోళన మొదలైంది. తుఫాన్ తీరం దాటిన సమయంలో గంటకు 185 కి.మీ. వేగంతో భీకర గాలులు వీస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని డిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య సుందర్బన్స్కు సమీపంలో నిన్న తీరం దాటింది. ఈ గాలులతో వేలాది ఇళ్లు నేలమట్టవ్వగా.. భారీ వృక్షాలు కూకటి వేర్లు సహా పెకిలించుకొని కుప్పకూలడం గమనార్హం. భారీ గాలులు, వర్షాలతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. మరోవైపు.. విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రస్తుతం పరిస్థితి క్రిటికల్‌గానే ఉంది. ఈ పరిస్థితి నుంచి ఆ రెండు రాష్ట్రాల పరిస్థితి ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు.
కేంద్రం స్పందన..
తుఫాన్ థాటికి అతలాకుతలమైన పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. కాగా.. సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారని.. తాము కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని మోదీ తెలిపారు. రెండు రాష్ట్రాల సీఎంలతో తాను మాట్లాడానని, అన్నివిధాలా ఆదుకుంటామని హోం మంత్రి అమిత్ షా అభయమిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments