బుల్లెట్ బైక్స్‌లో సమస్యలు.. 7000 వాహనాలు వెనక్కి...
Send us your feedback to audioarticles@vaarta.com
బుల్లెట్ బైక్స్ అంటే నేటి యూత్ తెగ ఇష్టపడుతోంది. నేటి యువతను ఎంతగానో ఆకట్టుకున్నది. ఇప్పటి వరకూ ఉన్న బ్రాండ్ బైక్స్ అన్నీ బుల్లెట్ వచ్చిన తర్వాత అనుకున్నంతగా సేల్ కాలేదు. అలా మార్కెట్‌లో దూసుకుపోతున్న బుల్లెట్ మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేసే ప్రఖ్యాత రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వినియోగదారులకు విక్రయించిన 7,000 బుల్లెట్, బుల్లెట్ ఎలెక్ట్రా మోటార్ సైకిళ్లను వెనక్కి రప్పించాలనుకుంటోంది. ముఖ్యంగా.. 2019 మార్చి 20 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో తయారైన బుల్లెట్ మోటార్ సైకిళ్ళలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు కంపెనీకి చెందిన ఓ అధికారి మీడియాకు వివరించారు.
కారణమేంటి..!?
2019 మార్చి 20 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో తయారైన బుల్లెట్ వాహనాల్లో బ్రేక్ కాలిపర్ బోల్ట్ సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించామని అందుకే ఆ బైక్‌లను వెనక్కి తీసుకుంటున్నామని సదరు సంస్థ చెబుతోంది. తమ ప్రమాణాలకు అనుకూలంగా లేకపోవడంతో బ్రేక్ కాలిపర్ బోల్ట్స్ సమస్య తలెత్తిందని.. దీంతో ఈ బైకులను వెనక్కి రప్పించి మరమత్తు చేస్తున్నామని అధికారి మీడియాకు వివరించారు. అయితే ఈ సర్వీస్‌కు గాను ఎలాంటి చార్జ్ చేయట్లేదని ఉచితంగానే అందజేస్తున్నామని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇప్పటికే బైక్స్ కొన్న కస్టమర్లకు సర్వీస్‌లకు రావాలని సమాచారం అందించడం ప్రారంభించింది. అయితే బైక్ మోడల్స్ ఏంటి..? అనే విషయం మాత్రం తెలియరాలేదు. అయితే అన్ని మోడల్స్‌కు ఈ సమస్య తలెత్తిందా అనే విషయంలో సదరు సంస్థ క్లారిటీ ఇవ్వలేదు.
ఇదేం కొత్త కాదు..!
కాగా... వాహనాల్లో లోపాలు బయటపడటం, కొన్ని యూనిట్స్ అమ్మిన తర్వాత వాటిని గుర్తించడం, రిపేర్ల కోసం వెనక్కి రప్పించడం ఆటోమొబైల్ కంపెనీలకు కొత్తేం కాదని చెప్పుకోవచ్చు. ఇదివరకు ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అయితే మోటార్ సైకిల్ రంగాన్ని ఏలుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి కంపెనీలో ఇలాంటి లోపాలు బయటపడటం ఆ బైక్ లవర్స్‌ని ఆందోళనకు గురిచేస్తుంది. మున్ముందు బుల్లెట్ కొంటే ఇంకెన్ని సమస్యలు తలెత్తుతాయో అని కొనడానికి సాహసించట్లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments