బుల్లెట్ బైక్స్‌లో సమస్యలు.. 7000 వాహనాలు వెనక్కి...

  • IndiaGlitz, [Tuesday,May 07 2019]

బుల్లెట్ బైక్స్ అంటే నేటి యూత్ తెగ ఇష్టపడుతోంది. నేటి యువతను ఎంతగానో ఆకట్టుకున్నది. ఇప్పటి వరకూ ఉన్న బ్రాండ్ బైక్స్‌ అన్నీ బుల్లెట్ వచ్చిన తర్వాత అనుకున్నంతగా సేల్ కాలేదు. అలా మార్కెట్‌లో దూసుకుపోతున్న బుల్లెట్ మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేసే ప్రఖ్యాత రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వినియోగదారులకు విక్రయించిన 7,000 బుల్లెట్, బుల్లెట్ ఎలెక్ట్రా మోటార్ సైకిళ్లను వెనక్కి రప్పించాలనుకుంటోంది. ముఖ్యంగా.. 2019 మార్చి 20 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో తయారైన బుల్లెట్ మోటార్ సైకిళ్ళలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు కంపెనీకి చెందిన ఓ అధికారి మీడియాకు వివరించారు.

కారణమేంటి..!?

2019 మార్చి 20 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో తయారైన బుల్లెట్ వాహనాల్లో బ్రేక్ కాలిపర్ బోల్ట్ సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించామని అందుకే ఆ బైక్‌లను వెనక్కి తీసుకుంటున్నామని సదరు సంస్థ చెబుతోంది. తమ ప్రమాణాలకు అనుకూలంగా లేకపోవడంతో బ్రేక్‌ కాలిపర్‌ బోల్ట్స్‌ సమస్య తలెత్తిందని.. దీంతో ఈ బైకులను వెనక్కి రప్పించి మరమత్తు చేస్తున్నామని అధికారి మీడియాకు వివరించారు. అయితే ఈ సర్వీస్‌కు గాను ఎలాంటి చార్జ్‌ చేయట్లేదని ఉచితంగానే అందజేస్తున్నామని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇప్పటికే బైక్స్ కొన్న కస్టమర్లకు సర్వీస్‌లకు రావాలని సమాచారం అందించడం ప్రారంభించింది. అయితే బైక్ మోడల్స్ ఏంటి..? అనే విషయం మాత్రం తెలియరాలేదు. అయితే అన్ని మోడల్స్‌కు ఈ సమస్య తలెత్తిందా అనే విషయంలో సదరు సంస్థ క్లారిటీ ఇవ్వలేదు.

ఇదేం కొత్త కాదు..!

కాగా... వాహనాల్లో లోపాలు బయటపడటం, కొన్ని యూనిట్స్ అమ్మిన తర్వాత వాటిని గుర్తించడం, రిపేర్ల కోసం వెనక్కి రప్పించడం ఆటోమొబైల్ కంపెనీలకు కొత్తేం కాదని చెప్పుకోవచ్చు. ఇదివరకు ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అయితే మోటార్ సైకిల్ రంగాన్ని ఏలుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి కంపెనీలో ఇలాంటి లోపాలు బయటపడటం ఆ బైక్ లవర్స్‌‍ని ఆందోళనకు గురిచేస్తుంది. మున్ముందు బుల్లెట్‌‌ కొంటే ఇంకెన్ని సమస్యలు తలెత్తుతాయో అని కొనడానికి సాహసించట్లేదు.

More News

జూన్ 7న అజయ్ స్పెషల్

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు అజయ్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడులో ప్రతి నాయకుడిగా నటించి

ప్రియాంక చోప్రాను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌

న‌టి ప్రియాంక చోప్రాను నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తున్నారు. అందుకు కార‌ణం మీట్ గాలా 2019. అమెరికా సోమ‌వారం ఈ వేడుక సోమ‌వారం అమెరికాలో ప్రారంభ‌మైంది.

సందీప్ కిష‌న్ 'తెనాలి రామ‌కృష్ణ బి.ఎ., బి.ఎల్‌' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం 'తెనాలి రామ‌కృష్ణ బి.ఎ బి.ఎల్‌'. 'కేసులు ఇవ్వండి ప్లీజ్‌' ట్యాగ్ లైన్‌.  తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా రూపొందుతోంది.

ధ‌నుష్ చిత్రానికి హాలీవుడ్ అవార్డ్‌

టాలీవుడ్‌, బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన కోలీవుడ్ హీరో ధ‌నుష్‌. ఈయ‌న హీరోగా న‌టించి తొలి హాలీవుడ్ చిత్రం `ది ఎక్ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ఫ‌కీర్‌`. ఇంగ్లీష్‌, స్పెయిన్ భాషల్లో...

వీవీప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపు వ్యవహారంలో చంద్రబాబుకు సుప్రీం షాక్

వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మరో 21 పార్టీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను