ఏడేళ్ల 'బృందావనం'
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని కొత్తగా ప్రజెంట్ చేసిన చిత్రాల్లో బృందావనం ఒకటి. జోవియల్‌గా, పాజిటివ్ ఆటిట్యూడ్‌తో ఉండే క్రిష్ పాత్రలో తారక్ ఒదిగిపోయాడు. అదుర్స్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత అదే సంవత్సరంలో వచ్చిన బృందావనం కూడా మంచి విజయం సాధించింది. ఫ్యామిలీ ఒరియెంటెడ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఓ ఫుల్‌ప్లెడ్జెడ్ మూవీలో ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రమిదే కావడం గమనార్హం. నిర్మాత దిల్ రాజుతోనూ.. దర్శకుడు వంశీ పైడి పల్లి తోనూ.. కథానాయికలు కాజల్ అగర్వాల్, సమంత తోనూ.. సంగీత దర్శకుడు థమన్తోనూ ఎన్టీఆర్ చేసిన మొదటి చిత్రమిదే కావడం విశేషం.
ప్రకాష్ రాజ్, శ్రీహరి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ముఖేష్ రుషి, ప్రగతి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు ఛాయాగ్రహణం అందించారు. కన్నడలో బృందావన, ఒడియాలో లవ్ మాస్టర్, బెంగాలీలో ఖోఖా 420, మరాఠిలో వృందావన్ పేర్లతో ఈ సినిమా రీమేక్ అయ్యింది. 2010లో అక్టోబర్ 14న విడుదలైన బృందావనం నేటితో 7 ఏళ్లను పూర్తిచేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout