2015లోనే 7 సినిమాలున్నాయి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్లో ఓ సినిమా ఎన్ని రోజులు ఆడింది అనే దానికంటే.. ఏ రేంజ్లో కలెక్షన్లు వసూళ్లు చేసింది అనే దానిపైనే ఫోకస్ ఉంది. 'మగధీర' తరువాత ఈ తరహా వాతావరణం నెలకొంది. రిలీజైన ప్రతి పెద్ద సినిమా కలెక్షన్లపై పరిశ్రమ వర్గాలు, ట్రేడ్ వర్గాలు, ప్రేక్షక వర్గాలు బాగానే ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఫోకస్ కేవలం లాంగ్ రన్ అనే అంశానికి పరిమితం కాకుండా... డే వన్ కలెక్షన్లపైనా ఉంటోంది.
ఆ లెక్కన తీసుకుంటే.. ఇప్పుడు టాప్ 10 డే వన్ కలెక్షన్లలో ఈ సంవత్సరం రిలీజైన సినిమాలు 7 స్థానాలను పొందాయన్నది ఓ సమాచారం. 22.4 కోట్ల రూపాయిల వసూళ్లతో బాహుబలి మొదటి స్థానంలో ఉంటే.. శ్రీమంతుడు 14.72కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో బ్రూస్లీ రూ 12.66 కోట్లతో ఉన్నాడు. అంటే మొదటి మూడు స్థానాలు ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజైన సినిమాలకే దక్కాయన్నమాట.
ఇక 4, 5 స్థానాలలో అత్తారింటికి దారేది (10.75 కోట్లు), ఆగడు (9.74 కోట్లు) ఉన్నాయి. ఆరు, ఏడు స్థానాలలో ఈ ఏడాదిలోనే రిలీజైన టెంపర్ (9.68 కోట్లు), సన్నాఫ్ సత్యమూర్తి (9.27 కోట్లు) ఉన్నాయి. ఎనిమిదో ప్లేస్లో 2013 నాటి బాద్షా (9.25 కోట్లు) ఉంది. తొమ్మిదవ స్థానంలో గోపాల గోపాల (9.19 కోట్లు), పదవ స్థానంలో రుద్రమదేవి (9.17 కోట్లు) ఉన్నాయి. మొత్తమ్మీద డే వన్ కలెక్షన్ల విషయంలో 2015 దుమ్ము రేపిందనుకోవాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com