ఏప్రిల్ 1 వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 7 టు 4.
Tuesday, March 29, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రాత్రి 7 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు పూర్తిగా ఒక రాత్రిలో జరిగే ఆసక్తికర కథతో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం '7 టు 4'. విజయ్ శేఖర్ సంక్రాంతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంద్ బచ్చు, రాజ్ బాలా, రాధికా, లౌక్య, పప్పు శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత విజయ్ శేఖర్ సంక్రాంతి మాట్లాడుతూ.. "ఒకే ఒక్క రాత్రిలో జరిగే పలు ఆసక్తికర సంఘటనలతో, థ్రిల్లింగ్ నెరేషన్‌తో సాగే ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. అలాగే ఈ థ్రిల్లింగ్ మూవీలో సోషల్ మెసేజ్ కూడా ఉంది. ప్రస్తుతం హర్రర్, థ్రిల్లర్ కథాంశాలకు మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అన్నారు.
శ్రీకాంత్, ప్రవీణ్, నివాస్, భరత్, కిరణ్, నితేష్, కార్తిక్, అనుష్, వెన్నెల, దివ్య, చిన్ననేత తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రచనాసహకారం: శ్రీకాంత్-రాజేష్-చంద్రశేఖర్, సాహిత్యం: శ్రీమతి ద్విభాష్యం శ్రీలక్ష్మీ వందన, సంగీతం: శ్రీమతి స్నేహలతా మురళి, కెమెరామెన్: ఇ. కె. ప్రభాత్-చిరంజీవి, ఎడిటర్: సత్య గిడుతూరి, సహ నిర్మాతలు: ఇ. బాలు నాయక్-కె.రమేష్, కథ-స్క్రీన్ ప్లే-సంభాషణలు-నిర్మాణం-దర్శకత్వం: విజయ్ శేఖర్ సంక్రాంతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments