శానిటరీ వర్కర్ జాబ్ కోసం 7వేల మంది గ్రాడ్యుయేట్లు క్యూ...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుత కాలంలో జాబ్ ఉంటే చాలు.. అది ఏం వర్క్ ఏం అనేది మాత్రం నిరుద్యోగులు చూడట్లేదు. మరీ ముఖ్యంగా ఎప్పట్నుంచో ఉద్యోగాల కోసం వేచి చూస్తుండే నిరుద్యోగులు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు ఇక అప్లికేషన్లే అప్లికేషన్స్. ఒక్క జాబ్ కోసం వేల మంది పోటీ పడిన రోజులు కూడా ఉన్నాయంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఇదిగో ఈ వార్త చదివితే నిజంగా నిరుద్యోగుల పరిస్థితి ఇలా ఉందా అని ఒకింత జాలి పడతారేమో. తమిళనాడు, కోయంబత్తూరు నగర కార్పొరేషన్లో వందల సంఖ్యలో శానిటరీ కార్మికుల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ఓ ప్రకటన వచ్చింది. దీంతో ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు.. వేలకొద్దీ నిరుద్యోగులు ఎగబడ్డారు. కాగా.. ఈ ఉద్యోగాలకు కనీస విద్యార్హత 10వ తరగతి. ప్రారంభ జీతం రూ .15,700.
కార్పొరేషన్లో మొత్తం 549 శానిటరీ కార్మికుల పోస్టులకు అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ 549 పోస్టులకు గాను మొత్తం 7 వేల మంది ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల స్వీకరిస్తున్న అధికారులు ఉద్యోగార్థుల అర్హత చూసి ఒకింత ఆశ్చర్యపోయారు కూడా. ఇప్పటి వరకూ 7వేల మంది దరఖాస్తుదారులు హాజరయ్యారని.. ఇందులో దాదాపు 70 శాతం మంది అభ్యర్థులు ఎస్ఎస్ఎల్సి, కనీస అర్హత పూర్తి చేసినవారు కాగా, వీరిలో ఎక్కువ మంది ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన పలువురు ఉద్యోగార్థులను మీడియా పలకరించగా.. ప్రతిదీ ఒక వృత్తి కాబట్టి శానిటరీ వర్కర్‌గా పనిచేయడంలో పెద్దగా సిగ్గు లేదనీ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments