ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సీజన్ వచ్చేసింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతలు సార్వత్రిక ఎన్నికల ముందు తలపడుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం రోజున అర్ధరాత్రి దాటాక పలువురు ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మొత్తం నాలుగు ఎమ్మెల్యే కోటా, రెండు గవర్నర్ కోటా, ఒకటి స్థానిక సంస్థల కోటా క్రింద ఎమ్మెల్సీ స్థానాల ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే కోటా కింద అభ్యర్థులు వీరే..
యనమల రామకృష్ణుడు
దువ్వారపు రామారావు
అశోక్బాబు
బీటీ నాయుడు
గవర్నర్ కోటాలో..
శివనాథ్ రెడ్డి
శమంతకమణి
విశాఖ స్థానిక సంస్థల కోటాలో..
బుద్ధా నాగజగదీశ్వర్రావు
కడప పెండింగ్..!?
విశ్వనాథనాయుడు, వీర శివారెడ్డి.. ఇద్దరూ తమకు ఎమ్మెల్సీ టికెట్లు కావాలని గట్టిగా సీఎంను పట్టుబట్టగా కుదరదని తేల్చి చెప్పేశారు. ఇప్పట్లో కుదరదని.. భవిష్యత్తులో అవకాశమిస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి ఆది నారాయణరెడ్డి ఈ సందర్భంగా వారిరివురికీ హామీ ఇచ్చి పంపారు.
కాగా ఈ అభ్యర్థులంతా నేడు నామినేషన్లు వేయనున్నారు. కాగా ఈ దఫా బీసీలకే సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఇతర సామాజిక వర్గం వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే పలువురు తెలుగు తమ్ముళ్లు ఎమ్మెల్సీ పదవులు ఆశించినప్పటికీ వాళ్ల ఆశలన్నీ అడియాసలయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout