పెన్నానదిలో 7గురు విద్యార్థుల గల్లంతు.. 4 మృతదేహాలు లభ్యం
Send us your feedback to audioarticles@vaarta.com
స్నేహితుడి ఇంట కర్మకాండకని వెళ్లిన ఏడుగురు విద్యార్థులు.. సరదాగా పెన్నానదికి వెళ్లారు. ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. అంతే ఏడుగురు స్నేహితులు పెన్నానది ఉధృతికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఏడుగురిలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కడప జిల్లాలో గురువారం ఈ విషాదం చోటు చేసుకుంది. తిరుపతికి చెందిన 8 మంది యువకులు.. సిద్ధవటంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం పూర్తైన అనంతరం సరదాగా.. పెన్నానదికి వెళ్లారు. ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. నది లోతును అంచనా వేయలేకపోవడంతో ప్రమాదవశాత్తు వీరిలో ఏడుగురు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో యువకుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన యువకులను తిరుపతికి చెందిన సతీష్ (20), ఇరుపూరి శంకర (20), రాజేష్ (19), యాష్ (22), జగదీష్ (20), నాని (20), తరుణ్ (20)లుగా పోలీసులు గుర్తించారు. కాగా... ఇప్పటివరకు నలుగురు యువకుల మృతదేహాలు వెలికితీసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మిగిలిన ఐదుగురి కోసం గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు నిర్వహిస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఏడుగురు యువకుల మృతితో తిరుపతిలో విషాదం నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments