69th National Film Awards 2023 : జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. అవార్డుల్లో దుమ్మురేపిన పుష్ప, ఆర్ఆర్ఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
2021వ సంవత్సరానికి గాను 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రంలో నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా ఉప్పెన, ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసిన కింగ్ సాలమన్, ఉత్తమ కొరియోగ్రఫీగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసిన ప్రేమ్ రక్షిత్ ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ గీత రచయితగా కొండపొలం చిత్రానికి గాను చంద్రబోస్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచాయి. ఉత్తమ్ చిత్ర విమర్శకుడు కేటగిరీలో పురుషోత్తమచార్యులకు అవార్డ్ దక్కింది.
ఇక ఈసారి జాతీయ ఉత్తమ నటిగా ఇద్దరు నటీమణులు సంయుక్తంగా ఎంపికయ్యారు. అలియా భట్ (గంగూభాయి కాఠియావాడి), కృతిసనన్ (మిమి)లు అందుకున్నారు. చిత్ర రంగంలో అద్భుత ప్రతిభ చూపిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పలు కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు. 31 విభాగాల్లో ఫీచర్ ఫిల్మ్స్‌కు, 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌కు, 3 విభాగాల్లో రచయితలకు అవార్డులను ప్రకటించారు. 2021వ సంవత్సరానికి గాను మొత్తం 281 ఫీచర్ ఫిల్మ్‌లు జాతీయ అవార్డుల కోసం పరిశీలనకు వచ్చాయి.
విజేతలు వీరే :
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కాఠియావాడి), కృతిసనన్ (మీమీ)
ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ (హిందీ)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం :ఆర్‌ఆర్‌ఆర్ (రాజమౌళి)
ఉత్తమ సంగీతం(పాటలు): దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప)
బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యాజిక్ : ఎంఎం కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి -మరాఠీ)
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్-హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమి-హిందీ)
బెస్ట్ యాక్షన్ డైరక్షన్: కింగ్ సాలమన్ (ఆర్‌ఆర్‌ఆర్)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్): శ్రేయఘోషల్ (ఇరివిన్ నిజాల్ - మాయావా ఛాయావా)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్): కాల భైరవ (ఆర్‌ఆర్‌ఆర్- కొమురం భీముడో)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: సర్దార్ ఉద్దమ్ సింగ్ (దిమిత్రి మలిచ్, మన్సి ధ్రువ్ మెహతా)
బెస్ట్ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి)
బెస్ట్ కొరియోగ్రఫీ: ప్రేమ్‌రక్షిత్ (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ గీత రచన: చంద్రబోస్ (కొండపొలం)
బెస్ట్ స్క్రీన్‌ప్లే: నాయట్టు (మలయాళం)
ఉత్తమ సంభాషణలు: గంగూబాయి కాఠియావాడి (హిందీ)
.బెస్ట్ సినిమాటోగ్రఫీ: సర్దార్ ఉద్దమ్ (అవిక్ ముఖోపాధ్యాయ)
బెస్ట్ కాస్ట్యూమ్స్: వీర్ కపూర్ ఇ (సర్దార్ ఉద్దమ్ సింగ్)
ఉత్తమ బాల నటుడు: భావిన్ రబారి (ఛల్లో షో-గుజరాతీ)
బెస్ట్ మేకప్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గుంగూబాయి కాఠియావాడి)
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments