68th National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీరే..!!

  • IndiaGlitz, [Friday,July 22 2022]

2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. అయితే ఈసారి బెస్ట్ క్రిటిక్ అవార్డ్ ఎవరికీ లేదని కేంద్రం తెలిపింది. ఫిల్మ్ మేకర్ విపుల్ షా నేతృత్వంలోని 10 మంది సభ్యుల జ్యూరీ విజేతలను ఎంపిక చేసింది. 30 భాషలకు చెందిన సినిమాలు 50 కేటగిరీలలో 300 ఫీచర్ ఫిల్మ్‌లు, 150 నాన్ ఫీచర్ ఫిల్మ్‌లు అవార్డుల కోసం పోటీపడ్డాయి.

ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు స్టార్స్ పంచుకోనున్నారు. సూరారైపోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) చిత్రంలో నటనకు గాను తమిళ నటుడు సూర్యతో పాటు తానాజీ చిత్రంలో నటనకు గాను బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్‌లను జాతీయ ఉత్తమ నటులుగా ఎంపిక చేశారు. ఇక సూరారైపోట్రులో సూర్యతో జంటగా నటించిన అపర్ణా బాలమురళికి జాతీయ ఉత్తమ నటి అవార్డ్ వరించింది.

ఉత్తమ నటుడు : సూర్య, అజయ్ దేవగణ్ (సంయుక్తంగా)

ఉత్తమ నటి : అపర్ణా బాలమురళి

ఉత్తమ చిత్రం : సూరారై పోట్రు

ఉత్తమ దర్శకుడు: సచ్చిదానందన్ (అయ్యప్పన్ కోషియం)

ఉత్తమ సహాయ నటి : లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్ సిలా పెంగళం)

ఉత్తమ సహాయ నటుడు : బీజూ మీనన్ (అయ్యప్పన్ కోషియం)

ఉత్తమ బాల నటుడు - వరున్‌ బుద్దదేవ్‌(తులసీదాస్ జూనియర్‌)- స్పెషల్‌ మెన్షన్‌

ఉత్తమ నేపథ్యం సంగీతం - జీవీ ప్రకాష్ కుమార్

బెస్ట్ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ - నచికేట్‌ బర్వే, మహేష్‌ షేర్లా(తానాజీ)

బెస్ట్ లిరిక్‌ - సైనా(మనోజ్‌ మౌతషిర్‌)

మోస్ట్‌ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌ - మధ్యప్రదేశ్‌

బెస్ట్‌ స్టంట్స్‌ - అయ్యప్పనుమ్‌ కోషియమ్‌

బెస్ట్‌ కొరియోగ్రఫీ - నాట్యం (తెలుగు)

ఉత్తమ డ్యాన్సర్‌: సంధ్య రాజు (నాట్యం- తెలుగు)

ఉత్తమ సంగీత దర్శకుడు - తమన్‌ (అల వైకుంఠపురములో)

నాన్‌ ఫియేచర్‌ ఫిలింస్‌

బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: శోభా రాప్సోడీ ఆఫ్‌ రెయిన్స్‌- మాన్‌సూన్స్‌ ఆఫ్‌ కేరళ (ఇంగ్లీష్‌)

బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: విశాల్‌ భరద్వాజ్‌ (1232 కి.మీ: మరేంగే తో వహీన్‌ జాకర్‌) (హిందీ)

బెస్ట్‌ ఎడిటింగ్‌: అనాదీ అతలే (బార్డర్‌ ల్యాండ్స్‌)

బెస్ట్‌ ఆన్‌లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌- సందీప్‌ భాటి, ప్రదీప్‌ లెహ్వార్‌ (జాదూయ్‌ జంగల్‌) (హిందీ)

బెస్ట్‌ ఆడియోగ్రఫీ(ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): అజిత్‌ సింగ్‌ రాథోడ్‌ (పర్ల్‌ ఆఫ్‌ ద డిసర్ట్‌ ) (రాజస్థానీ)

బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: నిఖిల్‌ ఎస్‌ ప్రవీణ్‌ (శబ్దికున్‌ కలప్ప) (మలయాళం)

ఉత్తమ డైరెక్షన్‌: ఆర్‌వీ రమణి (ఓ దట్స్‌ భాను- ఇంగ్లీష్‌, తమిళ్‌, మలయాళం, హిందీ)

ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్‌ (మరాఠి)

ఉత్తమ షార్ట్‌ ఫిక్షన్‌ ఫిలిం: కచీచినుతు (అస్సాం)

స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌: అడ్మిటెడ్‌ (హిందీ, ఇంగ్లీష్‌)

బెస్ట్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఫిలిం: ద సేవియర్‌: బ్రిగేడియర్‌ ప్రీతమ్‌ సింగ్‌ (పంజాబీ)

బెస్ట్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఫిలిం: వీలింగ్‌ ద బాల్‌ (ఇంగ్లీష్‌, హిందీ)

బెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఫిలిం: డ్రీమింగ్‌ ఆఫ్‌ వర్డ్స్‌ (మలయాళం )

బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌: జస్టిస్‌ డిలేయ్‌డ్‌ బట్‌ డెలివర్‌డ్‌ (హిందీ), 3 సిస్టర్స్‌ (బెంగాలీ)

బెస్ట్‌ ఎన్వైర్‌మెంట్‌ ఫిలిం: మాన అరు మానుహ్‌ (అస్సామీస్‌)

బెస్ట్‌ ప్రొమోషనల్‌ ఫిలిం: సర్‌మొంటింగ్‌ చాలెంజెస్‌ (ఇంగ్లీష్‌)

More News

68th National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా ‘‘కలర్ ఫోటో’’... బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘థమన్’

2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

Lal Singh Chadda: 'లాల్ సింగ్ చెడ్డా' నుంచి నాగ చైతన్య లుక్ విడుదల

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లాల్ సింగ్ చెడ్డా.

Janasena : జగన్‌వి గొప్పలే.. 10 శాతం కూడా భూసేకరణ కాలేదు : రామాయపట్నం పోర్ట్ నిర్మాణంపై నాదెండ్ల వ్యాఖ్యలు

రామాయపట్నం పోర్టు నిర్మాణంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు.

Janasena : సీక్రెట్‌గా ఆ డీల్, రామాయపట్నంపై ఎన్నో అనుమానాలు.. జగన్ సమాధానం చెప్పాల్సిందే: నాదెండ్ల

కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ తో ఉన్న ఎమ్.ఓ.యు.ని ముఖ్యమంత్రి ఎందుకు గోప్యంగా ఉంచారని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.

Parampara Season 2: 'పరంపర' సీజన్ 2ను ఎంజాయ్ చేస్తున్నారు - శరత్ కుమార్

డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' సీజన్ 2 వచ్చేసింది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్,