ఘోర దుర్ఘటన... 62 మంది సజీవ దహనం !
- IndiaGlitz, [Saturday,August 10 2019]
ఆఫ్రికా దేశంలోని టాంజానియాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. ఇది గమనించిన స్థానికులు, ప్రయాణికులు ఆయిల్‌ను తెచ్చుకునేందుకు క్యూ కట్టారు. అయితే ఒక్కసారి ఘటనాస్థలిలో భారీ పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున జనాలు సజీవ దహనమయ్యారు. కాగా.. వీరిలో అత్యధికులు స్థానిక ట్యాక్సీ డ్రైవర్లేనని తెలిసింది. తెలుస్తోంది. ఈ ఆయిల్ ట్యాంకర్ విస్ఫోటనంతో మొత్తం 62 మంది దుర్మరణం పాలయ్యారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు గుర్తించింది 62 మృతదేహాలే.. మరికొందర్ని అత్యవసర చికిత్సకై ఆస్పత్రికి తరలించడం జరిగింది. అయితే ఇంకా కొందరు మంటల్లో చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
అసలేం జరిగింది!?
కాగా ఈ ఘోరానికి కారణం ఓ వ్యక్తి సిగరెట్ అంటించడమేనని తెలుస్తోంది. అందరితో పాటు ఓ వ్యక్తి పెట్రోల్ తీసుకోవడానికి ట్యాంకర్ దగ్గరికి వెళ్లాడు. అయితే సిగరెట్ అలవాటు ఉండటంతో అనుకోకుండా సిగరెట్ వెలిగించాడట. దీంతో ఒక్కసారి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయని సమాచారం. ఈ భారీ శబ్దాలకు ట్యాంకర్ పేలిపోయింది. అయితే ఈ ఘటన ఎలా జరిగింది..? అనే కచ్చితమైన కారణాలు మాత్రం తెలియరాలేదు.