గూగుల్ ప్లే స్టోర్ నుంచి 600 యాప్‌లు తొలగింపు!
- IndiaGlitz, [Saturday,February 22 2020]
అవును మీరు వింటున్నది నిజమే.. ఒకట్రెండు కాదు ఏకంగా 600 మంది యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించడం జరిగింది. అనుచిత ప్రకటనలతో వినియోగదారులకు చికాకు తెప్పిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ డివైజ్‌లను వినియోగిస్తున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా, డివైజ్ పనితీరును దెబ్బతీసేలా, అనుకోని రీతిలో తెరపై ప్రకటనలను ఇస్తున్న యాప్‌లను తొలగిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఇప్పటికే దాదాపు 4.5 బిలియన్ల సార్లు ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం.
యాప్‌ని వినియోగించని సమయంలో, కాల్ చేస్తున్న సమయంలో కూడా ఇవి స్క్రీన్‌పై ప్రకటనల్ని చూపిస్తున్నట్లు గుర్తించారు. దీనివల్ల వినియోగదారుల విలువైన సమయం వృథా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వీటిని యాప్ నుంచి తీసేశామన్నారు. కాగా.. ఇప్పటికే సదరు యాప్‌ల ద్వారా ప్రకటనలు ఇచ్చిన కంపెనీలకు లేదా ఉత్పత్తులకు నిబంధనల ప్రకారం డబ్బులు తిరిగి చెల్లిస్తామని తెలిపారు.