108 గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. 60 వాహనాలు దగ్ధం
- IndiaGlitz, [Monday,May 06 2019]
హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 108 గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. 60 వాహనాలు తగలబడ్డాయి. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఫైరింగ్ సిబ్బంది మంటలు ఆర్పింది. మరమ్మతుల కోసం గోడౌన్‌లో అంబులెన్స్‌లు ఉంచగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్య్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఎలా జరిగింది...? ఎవరైనా కావాలనే పనిగట్టుకుని ఇలా చేశారా..? లేకుంటే షార్ట్ సర్వ్యూట్ వల్లే జరిగిందా..? ఎంత ఆస్తినష్టం వాటిల్లింది..? ప్రాణనష్టం ఏమైనా జరిగిందా..? అనేది తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సైరా సెట్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి కోట్లల్లో ఆస్తి నష్టం వాటిల్లిన విషయం విదితమే. కాగా ఈ ఘటన ఎలా జరిగిందనే విషయం ఇప్పటి వరకూ బయటికి రాలేదు. ఇలా వరుస ఘటనలు చోటుచేసుకోవడంతే ఎప్పుడేం జరుగుతుందో అని జనాలు బెంబేలెత్తిపోతున్నారు.