మహేష్ 'దూకుడు'కి ఆరేళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
దూకుడు.. సూపర్ స్టార్ మహేష్‌బాబు కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం. పోకిరితో గత రికార్డులను తిరగరాసిన మహేష్‌కి.. ఆ తరువాత వచ్చిన సినిమాలేవీ ఆశించిన విజయం అందించలేదు. ఈ నేపథ్యంలో పోకిరి రిలీజైన ఐదేళ్ల తరువాత దూకుడు చిత్రం వచ్చి ఆ లోటు తీర్చింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న టైంలో దర్శకుడు శ్రీను వైట్ల చేసిన చిత్రమిది.
మహేష్‌బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ఈ తొలి చిత్రంలో మహేష్ నటన, సమంత గ్లామర్, బ్రహ్మానందం - ఎమ్మెస్ నారాయణ కామెడీ, థమన్ సంగీతం, పార్వతీ మెల్టన్ ప్రత్యేక గీతం, శ్రీను వైట్ల దర్శకత్వం, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రధాన ఆకర్ణణలుగా నిలిచాయి.
కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా ఈ చిత్రం సొంతం చేసింది. ముఖ్యంగా ఏడు నంది అవార్డులను, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను, 8 సైమా అవార్డులను సొంతం చేసుకుందీ చిత్రం. 2011లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన దూకుడు.. నేటితో ఆరేళ్లు పూర్తి చేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com