నల్గొండలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లి.. తిరిగి ఇంటికి చేరుకుంటున్న తరుణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. మరో 10 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. నల్లొండ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళుతున్న ఆటో పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్దకు రాగానే.. బొలేరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కన్నుమూసి తెరిచే లోగా ఆటో డ్రైవర్ సహా ఐదుగురు మహిళల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో పదిమందికి గాయాలవగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కూలీలంతా వరినాట్ల కోసం రంగారెడ్డిగూడెం వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో 21 మంది ఆటోలో ఉన్నట్టు తెలుస్తోంది. మృతులంతా చెన్నంపేట మండలంలోని సుద్దబావితండాకు చెందిన రోజువారి కూలీలుగా గుర్తించారు. క్షతగాత్రులను దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాద తీవ్రతను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో మల్లేశం(ఆటో డ్రైవర్), నోముల సైదమ్మ, నోముల పెద్దమ్మ, మల్లమ్మ, గొడుగు ఇద్దమ్మ, కొట్టం పెద్దమ్మ ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com