జీహెచ్‌ఎంసీలో రెండో రోజు 580 నామినేషన్ల దాఖలు..
Send us your feedback to audioarticles@vaarta.com
జీహెచ్ఎంసీ ఎన్నికలకు శుక్రవారం చివరి రోజు కావడంతో బెర్త కన్ఫర్మ్ అయిన నేతలంతా నామినేషన్స్ దాఖలు చేసేస్తున్నారు. పార్టీలన్నీ తమ పార్టీల తరుఫున పోటీ చేయబోయే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కొన్ని పార్టీలు దాదాపు తుది జాబితాను సిద్ధం చేసేశాయి. ఈ క్రమంలోనే బీఫారాలు దక్కిన నేతలంతా నామినేషన్స్ దాఖలు చేసేస్తున్నారు. సమయం పెద్దగా లేకపోవడంతో బీ ఫారం దక్కిన వెంటనే వెళ్లి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసేస్తున్నారు.
కాగా.. గురువారం ఒక్కరోజే 522 మంది అభ్యర్థులు.. 580 నామినేషన్లను దాఖలు చేశారు. ఇప్పటి వరకూ 537 మంది అభ్యర్థులు.. 597 నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ 195, బీజేపీ 140, కాంగ్రెస్ 68, ఎంఐఎం 27, టీడీపీ 47 నామినేషన్లు దాఖలు చేసింది.సీపీఎం 4, సీపీఐ 1, వైసీపీ 1, రిజిస్టర్డ్ పార్టీలు 15, స్వతంత్రులు 110 నామినేషన్లు దాఖలు చేశారు. రేపటితో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com